...

3 views

పరిచయం
@writer419

కొందరి పరిచయాలు ఎందుకు అయ్యాయ్యి అనిపిస్తాయి,
మరికొందరి పరిచయాలు ఇంకాస్త ముందుగా అయ్యిండాల్సింది,
ఇంకొందరి పరిచయాలు అసలు అవ్వకుండా ఉండాల్సింది అనిపిస్తాయి...

రంగులు మార్చేవారు కొందరు,
రంగులమయం చేసేవారు మరికొందరు,

ప్రేమించే మనుషులు కొందరు,
ద్వేషించే మనుషులు మరికొందరు,

మెచ్చే జనం కొందరు,
కిట్టని జనం మరికొందరు,

తీపి అయినా చేదు అయినా ఈ అనుభవాలన్నీ రేపన్నా నా జీవితానికి అయ్యాయి పాఠాలు...

#poetrycommunity #poetrylovers
#poem
© Singavarapu Surekha