...

4 views

ప్రేమ...
ఎంత మధురమీ ప్రేమ
తెలియని కొత్త రుచులు పరిచయం చేస్తుంది

ఎంత తెలివైందీ ప్రేమ
తెలిసీ చిలిపి అబద్ధాలు నేర్పుతుంది

ఎంత వింతైనదీ ప్రేమ
కొంగొత్త దారుల్ని అందంగా చూపిస్తుంది

ఎంత మాయైనదీ ప్రేమ
మనసుని ఆధీనపర్చుకొని మనిషిని ఆడిస్తుంది

ఎంత గొప్పదీ ప్రేమ
మనసా వాచా నమ్మిన వారికి నీడై నిలుస్తుంది

© Nakshathra