...

9 views

చూసా చూసా...
విప్పారిన కన్నులతో చూసా నిన్ను
కనులకు పండగే ఇవాళ
ఎంత ఆత్రాన్ని నింపుకున్నాయో అవి
పరిచేసాయి నిన్ను చూడగానే
అంతటి నిలువెత్తు రూపం.. నా కళ్ళముందు కూర్చుంటే
గొంతు పెగలదే
మాట రాదే
నిన్ను అలా చూస్తో ఉండిపోవాలనిపించడం అతిశయోక్తి కాదేమో
నీతో ఎన్ని చెప్పాలనుకున్న
ఎన్నో నిన్ను అడగాలనుకున్న
అన్నిటికీ చూపులే సమాధానమైనయ్
నిష్చేష్టురాలినై నిస్సహాయురాలినై
ఇవ్వగలిగా కేవలం నా చూపుల్ని నీకు కానుకగా

-నక్షత్ర

© Nakshathra