...

1 views

నా విషాద గీతం
ఈ ప్రేమ తపస్సు
ఇక చేయ లేను
ఆ కఠిన హృదయాన్ని
కరిగించ లేను....
ఈ ప్రేమను ఆనంద గీతమని
భా వించాను.....
ఇది విషాద గీతమై
ఇపుడిక మృత్యు గీతమై
నాలో ప్రతి ధ్వనిస్తున్నది
నా అశ్రువులు విషాదంతో
బరువెక్కి మంచు బండలుగా
రాలుతున్నా యి
ఇకచాలు ఆకఠిన శిలకరుగదు
పదే పదే గాయపడిన నామనసు
ఇక రోదించ లేదు.....
పిలిచి పిలిచి ఎండిపో యిన
నా గొంతు ఇక పిలువలేదు
నాలోనేను... నాతోనేను
ఇక పోరాడ లేను.....
ఈ విరహపు చేదు కషాయాన్ని
మరి త్రాగలేను
ఈ నిట్టూర్పుల సెగల్లో
మనసు మైనం లా కరిగిపోయింది
నీ మౌనాన్ని ఇక భరించలేను
నిశబ్దం రాక్షస శబ్దంగా మారి
నా చెవులను హింసిస్తు న్నది
ప్రియా.... నీ పాదాలకు ఎన్నో
కవితలు సమర్పిం చాను
ఈ ఆఖరి కవితని
నీ పాదాల వద్ద ఉంచి
వెళ్లి పోతున్నాను



© Bala Visweswara Rao Pratapa