...

6 views

కనురెప్పల తీరంలో....
కాలం గడుస్తుంది ..క్యాలెండరు నడుస్తోంది ఒలంపిక్స్ పరుగులా ...
నేను మాత్రం
కలల కలవరింతలలో
నిన్ను చూసిన క్షణంలోనే ఉండిపోతున్నా..... అర్థమవుతుందా..!!

నీ జ్ఞాపకాలను చదువుతూ
కంటికి కునుకు లేదు..
కొన్నింటిని భద్రపరుస్తూ
మనసుకు కుదురే లేదు....భోధపడుతుందా....!!

అలుపే లేని నీ ఊహలు
ఎగిసి పడే అలల్లా
తనువును తడిపేస్తుంటే.. మనసును చుట్టివేసి
ఉక్కిరి బిక్కిరితో....ఊపిరాడట్లేదు మరీ...ఊహకైనా తోస్తుందా...!!

ఏ మలుపులోనైనా
నువ్వు కనిపిస్తావని...
కొత్త ఆశల రంగులు నింపుకొని...
కనురెప్పలే సీతాకోకరెక్కలై..చూపుల దారి వెతుకుతుంటే...వెక్కిరింతలా..!!

నీ పెదాల పదవిచేరి
నా పేరునే లిఖిస్తుంటే
ఆ వేడుకనీ చూడాలనీ
కలల రెప్పలు విదిలించి
దిగులు తీరే రోజు కోసం
ఊహల సరిహద్దులో
ఎదురు చూస్తున్నాను...కవనపు తోటలో...!!