...

5 views

పెళ్లిచూపులు
బిక్కుబిక్కుమంటూ భయంతో వంచిన అమ్మాయి తల
సిగ్గుతో చిన్నచిన్నగా చూస్తున్న అబ్బాయి తుంటరి చూపులు

నాన్న గౌరవం కోసం మంచి సంబంధం అని కూర్చున్న అమ్మాయి
అందమైన అమ్మాయి తన ఇంటి దీపం కావాలని వచ్చిన అబ్బాయి

అమ్మాయి నచ్చిందా బాబు అని అడుగుతున్న చుట్టూ ఉన్నవారు
నచ్చింది అనడానికి సిగ్గుపడుతూ చిన్న నవ్వుతో సమాధానం ఇచ్చిన అబ్బాయి

మా అబ్బాయి నచ్చాడా అమ్మ అని అడుగుతున్న అత్తగారు
నచ్చాడని తన తండ్రి వైపు చూసి కన్నులతో సమాధానం ఇచ్చిన అమ్మాయి

కూతురికి పెళ్లి కాబోతుందని చెమ్మగిల్లిన
తల్లిదండ్రుల కన్నులు
అందాల అపరంజి తన ఇంటి మహాలక్ష్మి కాబోతుందని మెట్టినింటి సంతోషాలు

కట్న కానుకలు ఏం పెడతారని అడుగుతున్న అత్తింటి వారు
వియ్యాలవారితో తూగుతామో లేదో అని తడబడుతున్న వియ్యంకులు

అన్నీ కూడుకున్న ఈ సంతోషాల సాయంత్ర వేళనే మా ఈ పెళ్లి చూపులు
© sravani writtings