...

3 views

స్వాగత రేఖలు
ఈ లోకమంతా కుల,మతాల కల్లాపి జల్లబడింది
స్వార్థపు రేణువులను సరితూస్తూ రాక్షసత్వాన్ని
గుండె నిండా శ్వాసిస్తున్నాం మనం
దించిన తల ఎత్తకుండా చదువుకున్న విద్యామంతులం
అప్పట్లో ఎవరో, ఎందుకో తెలియకుండానే
ఎత్తిపోసిన మూఢాచారాలను సాంప్రదాయమని
భుజాల మీదుగా నడిపిస్తున్న బుద్ధిహీనులం
కనబడదు మనకు
రాచరిక వ్యామోహ అరాచకం
వినబడదు మనకు
పేదరిక స్వాతంత్ర్య భిక్షాటనం
అంతుపట్టని ఆర్థికమే సమాజ"మంటా"ం
గుట్టువిప్పని గణాంకమే చైతన్య"మంటా"ం
కనబడని కాలానికి గేలం వేసి పట్టే
మాయా దిక్కులకు దణ్ణం పెట్టే మూర్ఖులం
సూర్యోదయానికై కాషాయపూలను పేర్చిన
అక్షరాల రంగు ఎప్పటికైనా బయటపడుద్ది
అప్పుడు ఈ ప్రకృతి ఇంకాస్త రంగును జోడించి
ఎర్రటి స్వాగత రేఖలను దాటిస్తూ ఆనందిస్తాది

© ఉత్పలిని📝