...

16 views

ఎక్కడున్నా నేను
కను రెప్పలు తెరవాలి అంటే భయం.....
ప్రతి రోజు నా గురించి నేను ఏమి వినాల్సి వస్తుందో అని...

ఉగ్గు పాల కోసం ఏడుస్తున్న పాపను చూడక.....ఆ పాలు ఇచ్చే రొమ్మును చూస్తుంది నా సమాజం....

అందమైన అమ్మాయి బయట అడుగు పెట్టాలంటే భయం ....ఏ పురుగు వచ్చి మీద పడి కుట్టేస్తుందో.....నన్ను అని...ఎక్కడున్నా నేను..

కాలేజి కి వెళ్ళిన అమ్మాయి ఇంటికి రాలేదు అంటే....తల్లి తండ్రులకి భయం....నా కూతురు ఏమై పోయిందో అని....ఎక్కడున్నా నేను..

తన సొంత కాళ్ళ మీద నిలబడాలని ఉద్యోగ వేటకి వెళ్తే.....భయం లంచం వద్దు నువ్వు వస్తావ అని ఒక మగ పురుగు అడుగుతుంది అని...ఎక్కడున్నా నేను...

అత్త గారింట్లో కూడా బంధాలు మరిచి పోయి....వరసలు లేకుండా మగాడి చూపులు తో చంపెస్తుంటే....ఎక్కడున్నా నేను..

నన్ను కాపాడండి అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్తే .....కాపాడాల్సిన పోలీస్ పురుగు కూడా నాతో రా అంటే ...ఎక్కడున్నా నేను....

న్యాయం కోసం పోరాడుతుంటే ఆ న్యాయ దేవత కూడా కళ్ళు తెడ్చి చూస్తుంది తప్ప ....నన్ను ఎవరూ బ్రతికించట్లేదు.....

నిన్ను పుట్టించడానికి అమ్మ కావాలి.....మరో ఆడదానిలో అమ్మ నీ ఎందుకు చూడలేక పోతున్నావు........

గాంధీజీ, రాజా రామ్మోహన్ రాయ్,నెహ్రూ,తిలక్ లాంటి మహానుభావుల కాలం నాటి నుండి పోరాటాలు జరుపుతూనే ఉన్నాం ,కానీ మన దేశం అన్నింట్లో ముందు ఉంటుంది కదా అందుకే ఆడదాని చంపడం విషయం లో కూడా ఎప్పుడు ముందే ఉంటుంది......

మన దేశం ఎప్పుడు అభివృద్ది చెందుతుంది నే ఉంటుంది......


నన్ను చంపకండి.......