...

1 views

నాకు కావాలనీ
కన్నీటి కడలి ఆనకట్ట తెగి
అనుభూతుల జ్ఞాపకాలలో
కొట్టుకుపోతూ మౌనంలోనే
విచిత్రమైన అల్లర్లతో అవలీలగా
తేలిపోవడం చెప్పాలని ఎంతో ఉన్నా,
నీవు గీసిన సీమరేఖలో అలా
మరిచిపోయి మరుగైన
స్మృతుల ఒంటరిలో నీ తోడు
నాకు కావాలనీ...
*****
ఉండీ పోరాదా
నువ్వే, నువ్వే నాకై
ఉండీ పోరాదా
నిజమే ఎప్పటికీ నీవై..
కంటికి రెప్పవై నువ్వే,
నాకు ప్రాణమై
ఉండీ పోరాదా నాలో నీవై..
గుండెకు చప్పుడై
శ్వాసకు ఊపిరై
ఉండీ పోరాదా నువ్వే,
నువ్వే జీవితమై..
నువ్వే నువ్వే నవ్వై
ఉండీ పోరాదా
నాకు కావాలనీ ...
సంపంగి బూర✍️