ప్రేమ
© sravani writings
నువ్వు పరిచయం అయిన వేళ తెలియదు
ఈ చిన్న పరిచయం నా ప్రపంచం అవుతుందని
ముఖ పరిచయమే లేని ముఖపుస్తకంలోని పరిచయం తెలీదు
మూడుముళ్ల బంధం వరకు వస్తుందని
నా గెలుపులో నాతోపాటు నువ్వు సంతోష పడుతున్నప్పుడు తెలీదు
నా ఓటమిలో కూడా నువ్వు ఉంటున్నావని
నువ్వు ధైర్యం చెబుతున్నప్పుడు తెలియదు నా జీవితానికి ధైర్యమే నువ్వు అవుతున్నావని
నువ్వు కోపంలో మాట్లాడుతున్నప్పుడు తెలీదు నీకు కోపం వెనుక కొండంత ప్రేమ ఉందని
నీ చెయ్యి పట్టుకొని నడుస్తున్నప్పుడు తెలియదు ఆ అడుగులను ఏడడుగులుగా మారుస్తున్నావని
నా తప్పులను హెచ్చరిస్తూ సరిదిద్దుతున్నప్పుడు తెలియదు నాకు జీవితం నేర్పే గురువు అవుతున్నావని
నాతో నీ కష్టసుఖాలను పంచుకుంటున్నప్పుడు తెలియదు
నీలో సగం నాతో పంచుకుంటున్నావని
నా అల్లర్లన్నీ భరిస్తూ నన్ను నువ్వు గారాభం చేస్తున్నప్పుడు తెలియదు నాకు నువ్వు ఇంకో నాన్న అవుతున్నావని
నా జీవితంలో జరిగే ప్రతి ముఖ్యమైన విషయాన్ని నీకే చెప్తున్నప్పుడు తెలియదు నా జీవితానికి నువ్వు సారధి అవుతున్నావు అని
నా జీవితానికి నువ్వే నే పిల్ల అని నువ్వు అన్నప్పుడు తెలీదు
నీ జీవితమే నాకు రాసిస్తున్నావని
నా కోపాన్ని భరించి ఓపిగ్గా సర్ది చెప్తున్నప్పుడు తెలియదు జీవితాంతం భరించే భర్తవుతున్నావని
ఇన్ని చేసిన నీకోసం తెలియట్లేదు
ఏం ఇచ్చి రుణం తీర్చుకోవాలో
అందుకే పెడుతున్న నీ పాదాల దగ్గర నా ప్రాణం
ఇన్ని పదాలు రాసిన నాకు తెలీదు ఇవి నీ ప్రేమ గూటికైనా సరిపోతాయో లేదో అని
ఇట్లాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ
నీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ఇట్లు
నీలో సగం