...

4 views

మూడు ముక్కలాట ♠️♣️♥️♦️🃏
మూడు ముక్కలాట
ముచ్చటైన ఆట

మరిపించు ఆట
మురిపించు ఆట

జోకరుండు ఆట
జోరునుండు ఆట

రాజు రాని (ణి) ఆట
ఏక (ఏకు) ముక్క ఆట

రమ్మను "రమ్మి" ఆట
రాని ముక్క కి, ప్రాకులాట

ఊరించి దింపు ఆట
ఓడుతున్న దింపు, ఊబిలోకి ఆట

మూడు ముక్కల, (నామాల) ఆట
52 పేకల, (వారాల) ఆట

ఆశలు - ఆస్తులు - కరిగించు ఆట
అలుసులు - అప్పులు - మిగిలించు ఆట

వయస్సు, మనస్సు - అడ్డు రాని ఆట
వ్యసనమై, పట్టి - పీడించు ఆట !!!
© Dinesh muddada