...

6 views

మా...

పొద్దున్నే Google లో కొటేషన్స్ చూడటం ఆపేసా...
ఫోటో గ్యాలరీ లో ఫోటోలు వెతకడం మానేసా...
Whatsapp లో Status గూడ్స్ బండిని
నడపడం నిలిపేసా....
"ఒక్క రోజే అమ్మని గౌరవించి మిగితా రోజులు మర్చిపోయే వాడిని కాదు నేను..అనే డైలాగూ వినేసా.."
ఆకాశం అంత ప్రేమ ని మేడమీద గోరు ముద్దలు తినిపించినపుడే చూసేసా....
అవును..ఈ సందర్భంగా తన ప్రేమ పొందని వారికి ఎలాగైనా దొరకాలని ఆశించా.....
అవునూ.....నిజంగా....
ఆ మాతృ మూర్తి మీద కవిత రాయాలంటే నాకు అక్షరాలు రావు....
ఎందుకంటే ఆ దైవాన్ని కొలిచి తూచే రాళ్ళు నాదగ్గర లేవుగా....