ఆటలో ఆడబొమ్మ ఆమె
సమస్తం ఆమె, సంబరం ఆమె, సహజీవనం ఆమె, సంతోషం ఆమె, సౌఖ్యం ఆమె, సాధించడం ఆమె, సర్దుకోవటం ఆమె, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఆమె. మరి నాటి రోజుల్లో ఆమెపై ఎందుకు అన్ని వివక్షలు , ఎందుకు అన్ని అవరోధాలు సృష్టించారు. చదువుకు దూరంగా , సంసారానికి దగ్గరగా ఉండాలని ఆమెకి సామాజిక సంకెళ్లు ఎందుకు వేశారు ? తల ఎత్తితే తాళిబొట్టు తెంచడం , ముసుగు తీస్తే ముండమోపిల్లా మార్చడం , ఎవరి స్వార్థం కోసం అలా చేశారు ? ఆమె మనసు ఎవరికి సొంతం , ఆమెపై ఎవరు పెత్తందారి ? భూమిని మాతగా మార్చారు, నీళ్లు ప్రవహిస్తున్న నదులను తల్లిగా మార్చారు, మరి నిజంగా తల్లిగా ఆమె రూపంలోనే నిజంగా ఉంటే ఎందుకు అంత అవమాన పరుస్తున్నారు. తప్పు మనలో ఉందా లేక మనం చదువుకున్న పుస్తకాలలో ఉందా ?
© Ravi Writings
© Ravi Writings