...

5 views

కరోన కథ ఇది!!
ఎక్కడో మొదలైన మహమ్మారి, మబ్బులా కమ్మింది మానవాళిని/
విరుగుడు లేదు రోగానికి, విరామం లేదు దాని విజృంభనకు/
అడుగు దూరమైన ఎగురునంట, గొంతులో గరళమై ఉండునంట/
ఆపు చేసే ఊపిరిని, ఆవిరి చేసే ప్రాణాన్ని/
పెద్ద-చిన్న తేడ లేదు,ఆడ-మగ ఆప లేరు/
పాలించే రాజైన, పండించే రైతైన, ప్రజలెన్నుకున్న నేతైనా/
కనిపించిందంతా కబళించింది, మరణ మృదంగం వినిపించింది/

యుద్ధం మొదలైంది మనవడా, కనిపించని శత్రువుతో/
మరణం పై రణం మొదలైన తరుణమది/
వైద్యులే వీరులుగా, పోలీసులే సైన్యాధిపతులుగా/
ప్రతి పౌరుడు వీరుడై, సైనికుడై పోరాడగా/
ఎక్కడో సరిహద్దుల్లో కాదు,ఎవరింట్లో వారుండి/
దూరం అనే అస్త్రంతో, మాస్కులనే కవచంతో/
అడుగు కదపక, అలుపెరుగక జరిగిన కురుక్షేత్రమది/
కానీ పూట ఖాళీగుంటే పొట్టకూటి కరువయ్యే కూలీలయే/
వివరించలేని వలస వేదనలు ఎన్నో, మరెన్నో/
కాలచక్రం కదలక, బ్రతుకు బండి సాగక
పసికందుల పేగులు తిప్పగా, ఆకలి కేకలు కోటలు దాటగా/
మానవళికదో అగ్నిపరీక్ష, కానీ మనిషికి సాటి మనిషే కదా రక్ష/
దాతల విరాళాలు వారాలుగా వరించే అన్నార్తులకు/
ప్రభుత్వాల అండగా ,దీనుల కడుపు నిండగా/
మేధావుల స్వేదంతో విరుగుడు తయారవ్వగా/
తరతరాలు వినబడే కరతాళాలు మ్రోగగా/
కన్నీళ్లు ఎండగా, నవ్వులు పూయగా, మానవాళి మరలా కలవగా/
మనిషి తప్పిదమో, ప్రకృతి ప్రతీకరమో తెలియదు /
పీల్చే గాలి, త్రాగే నీరు,నిలబడే నేల/
ఎగిరే పక్షులు, పరిగెత్తే మృగాలు, ఈదే చేపలు/
మనమంతా ప్రకృతి తల్లి బిడ్డలేమని /
ఆ తల్లి మనసు గాయపరచకూడదని నేర్చిన రోజది/
దానవులపై గెలిచిన మానవుల ఇతిహాసం ఇది/
విపత్తుని జయించి, హరివిల్ల్లులా నవ్వులు విరజల్లిన వీరగాథ ఇది/
ప్రపాంచానికి పరిశుభ్రత విలువ నేర్పిన కరోన కథ ఇది !!.../© All Rights Reserved