...

0 views

సృష్టికి మించిన హార్డ్ టైం ఉందా??
తండ్రి పేరుకై ప్రేమించిన వారిని వదలడం భర్త పేరుకై ఇంటిని వదలడం తమ్ముని కొరకు ఆస్తీని వదలడం పిల్లల కొరకు ఉద్యోగం వదలడం బయట ఎవరన్నా ఏడిపిస్తే బయటికి వెళ్లడం మానివేయడం లోపల ఎవరన్నా ఏడిపిస్తే నమ్మకాన్ని వదిలివేయడం ఇతరుల కోరికలను తీరుస్తూ తన కోరికలను సమాధి చేయడం పిచ్చి జనాలతో జీవించడం కంటే ఓ మంచిస్త్రీ ప్రాణాలను తీసుకుంటుంది. ఇన్ని కష్టాలను అనుభవిస్తూ కూడా సృష్టికి రూపాన్ని ఇస్తుంది.. ఒక సృష్టి కష్టాల పాలుకు మించిన హార్డ్ టైం ఇంకేముంటుంది చెప్పండి. స్త్రీ స్వార్థాన్ని వదిలేసి ఏ క్షణమూ తన కొరకు జీవించక తన కుటుంబం కొరకు జీవించే స్త్రీకి సమాజంలో గౌరవం కూడా దొరకడం లేదు.. ఇది చేదుగా ఉండవచ్చు కానీ నిజం ఇదే ఇంతకు మించిన హార్ట్ టైం నాకు ఎక్కడా కనిపించలేదు... మనదేశంలో డబ్బులు,ఆస్థులు కొడుకులు చూసుకుంటారు. మంచీ/మర్యాద, కుటుంబ గౌరవం సభ్యతా సంస్కారం కూతుళ్ళు చూసుకోవాలి ...
*****
పరీక్షించకుండా ఏదీ ఉండదు హార్ట్ టైంమనిషిని పరీక్షిస్తుంది కాసేపు విద్యార్థుల అవ్వమని అప్పుడే కదా ఉత్తీర్ణత అనుత్తీర్ణతల విలువ తెలిసేది. "जो डर गया ओ मर गया" ໖ ๒๕ .. ఈ సందర్భంలో అబ్దుల్ కలాం గారు చాల బాగా చెప్పారు, " కష్టాలు నిన్ను సాధించడానికి రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నీవు నిరూపించుకునేందుకే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి కదా నిన్ను సాధించడం కష్టమని".. ఎంత బాగా చెప్పారండి, మనిషి తలుచుకుంటే అన్నీ అవలీలగా నెట్టుక రాగలడు అలాంటి శక్తి సామర్థ్యాలు మనిషిలో ఉన్నాయి కానీ తలుచుకోడు కదా...
సంపంగి బూర✍️