...

5 views

సర్వం శివమయం
ఎంత పేదవాడివో.. ఎంత గొప్పవాడివో...
నీకు...
ఖరీదైన కిరీటాలు లేవు- జటలు ధరించెదవు
విలువైన వస్త్రాలు లేవు- పులితోలు కప్పుకునెదవు
ఆడంబరమైన ఆభరణాలు లేవు-నాగులను చుట్టుకునెదవు
నిరాడంబరము నీ లీల
ఇది జనులకు ఆదర్శమాల
ఎంత పేదవాడివో...ఎంత గొప్పవాడివో...

నేను నీవలె పేదవాడిని;అందుకే...
నా హృదయాన్నే ఆలయంగా మలిచా నీకు
నా రుధిరంతో ప్రతీ క్షణం అభిషేకం చేస్తున్నా నీకు
నా శ్వాసను ప్రసాదముగా చెల్లిస్తున్నా నీకు