...

8 views

ఆమె దేహం..
అందరికీ ఎంత ప్రేమో కేవలం ఆమె దేహమంటేనే!
ఇంటిపనికి అదే కావాలి
ఇంటియజమాని పనికి అదే కావాలి
పిల్లల్ని కనడానికి కావాలి
ఆ పిల్లల్ని సరిగ్గా పెంచడానికి కావాలి
ఒళ్ళో పడుకోబెట్టుకోడానికి కావాలి
బళ్ళ చుట్టూ తిరగడానికి కావాలి
ఆ పిల్లల పెళ్లిళ్ల తర్వాత వాళ్ళ పిల్లలకి ఆయా పనిచేయడానికీ కావాలి
ఎంతమంది పిల్లల్ని కన్నా
పెళ్లై ఎన్నేళ్లయినా లావుకాకుండా నాజూకుగా ఉండే దేహమే కావాలి
వంటపనికీ ఒంటిపనికీ అదే దేహం కావాలి
గుమ్మం దాటితే వెకిలిచూపులు విసరడానికీ అదే కావాలి
ఎన్నేళ్ళు గడిచినా
ఎందరో యజమానులు ఆమె దేహానికి
ఒక్క ఆమె తప్ప...

© Nakshathra