...

0 views

పసిడి పరుగు
నీవు గానని పది మందిన నేనూ ఒంటరిని,,
నీకున్న పదుల స్థానమందు నేనెవరిని,,
ఏది ఏమైనా ఎవ్వరేమైనినా
నే మెచ్చినది నా మది ఒప్పినది
నీవే నా పసిడివనీ
ఇక ఒక్క మాట మాటాడకు మాఁవా
నేటి నా సంబరాల నా బంగారం నీవే ...
****
నిన్ను వెదికాను నిశీధి నిరసనలో
తలుక్కున పసిడిలా మెరిసి మాయమయ్యావు
ఓ ఉత్కృష్ట ఉపన్యాసం లా...
ఇప్పుడే మదిలో మెదిలిన అక్షరభావం
ముందుగా మీకే అందించాను.
అవధులు దాటిన ఆనందంలో
ఇంత ఆనందం పసిడి ఎన్నడూ కలిగించ లేదు ..
****
. యే రేయి అయినా
యే సంధ్య అయినా
ప్రతి ఉదయ ఉషోదయానా
ప్రతి ఘడియ, ప్రతిక్షణాన
నేనెందుకు గుర్తు రాను
నా బంగారం ...
సంపంగి బూర✍️