...

3 views

నిమిత్తమాత్రులం మాత్రమే
ఏ తలపుల్లో ఎన్ని జ్ఞాపకాలో!
ఏ రాతలో ఎన్ని గీతలో!
ఏ మనిషిలో ఎన్ని వ్యధలో?
ఏ శ్వాసలో ఎన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలో!
ఆ విధాతకే తెలుసు!

ఏ వేణువులో ఎన్ని రాగాలో!
ఏ నిద్రలో ఎన్ని కలలో?
ఏ గెలుపులో ఎన్ని ఒడుదొడుకులో?
ఏ నవ్వులో ఎన్ని వేదనలో?
ఆ విధాతకే తెలుసు!

ఏ మార్గంలో ఎన్ని మలుపులో!
ఏ మనసులో ఎన్ని తలపులో!
ఏ ప్రేమలో ఎన్ని త్యాగాలో!
ఏ పెళ్ళిలో ఎన్ని అవసరాలో!
ఆ విధాతకే తెలుసు!

ఏ జననంలో ఎన్ని మార్పులో?
ఏ కవనంలో ఎన్ని చేర్పులో?
ఏ రాయిలో ఎన్ని శిల్పాలో?
ఏ చిత్రంలో ఎన్ని రంగులో?
ఏ మరణం ఎన్ని రోజుల్లో?
ఆ విధాతకే తెలుసు!
నిమిత్తమాత్రులం మనమంతా!
ఆపగలిగేదెవరు? ఎవరు? జరిగేదంతా!
© Dinesh muddada