...

3 views

నేను మల్లియనై..✍️
నా మనసు సందేశాన్ని..అక్షరాలుగా చెక్కి..
మెత్తని పదాలుగా మలిచి.... సిరా రంగుతో తడిపి....
స్నేహ పరిమళాలను పూసి.....
మౌన సందేశం పంపుతున్నా..
కాగితానికి నా మదిలోని భావనలద్ది...
చదువుకో..నేస్తమా...
నా అంతరంగమథనాన్ని..
నీ కనుల అద్దంలో కాంచి...

నీ ఆలోచన మెరుపు తగలగానే..
చీకటి కప్పిన... నింగి సైతం..
సిగ్గు వర్ణంతో..స్నానమాడుతుంటే...
నీ నవ్వుల చూపులే...
నడిచే తారకలై కనపడుతుంటే..
లెక్కపెడుతూ నే కూర్చున్నా...
ఆశ్చర్యపు తిన్నెపై...
అలుపంటూ లేకుండా...
అడుగుతున్నా..ఆ చిరునవ్వుల చుక్కలనే...
అంతమే లేదా..అంటూ...!!

గంధమద్దిన... చల్లదనం..నీ పలుకు..
గమకం తెలిసిన గడుసుతనం..ఆ తళుకు..
మరీ...నీ మాటలన్నీ ...
మల్లెల స్వచ్చత పులుముకునీ..
మృధు మధుర పరిమళాన్ని పంచుతుంటే...
చందనాలన్నీ..చిన్నబోయి..
నీ ఎదుటపడనంటూ...దాగిపోయే..!!

నీ కంటిచూపులన్నీ...
వసంతం కొమ్మన పూసిన విరులైనట్టున్నవీ....
వేల వర్ణాలతో మెరుస్తూ..భువి సీమని..
పరుచుకున్నవి...వెండి వెన్నెలలై...
ఇది చూసి మిణుగురులన్నీ...మిన్నకున్నవీ..!!

నీ చిరునవ్వు...
చిక్కని చీకటిలో...జారిన తోకచుక్కలా...
ముత్యపు చిప్పలో... మొలిచిన మాటముత్యమై...
నా ఎదమెడను చేరగా...
ఆనందంతో అత్తిపత్తినైపోతుంటి...