...

8 views

ప్రేమ ఋతువు🖤🤍
ఋతువు కోసం ఆగిపోతాను
వసంతం నువ్వు తెస్తానంటే
సంధ్యలు, సాయంకాలాలు, మల్లెలు
చెంపలపై మోసుకొస్తాను
నా ప్రపంచం నువ్వావుతానంటే

రాత్రి నక్షత్రాల అల్లరి,
సీతాకోకచిలుకుల రంగుల్ని
గుమ్మం ముందు పెట్టి వచ్చాను
కలిసి సముద్రమవుదాము

వెంట రానంంటున్న పూలకోసం
భ్రమరాల తోడు తీసుకుని బ్రతిమాలాడాను
ఆకాశం ఇచ్చిన ప్రతిసారి
కొన్ని పచ్చి వానచినుకుల్ని దాచాను
మనం ఇప్పుడు వర్షంలో తడిచిన
భూమి

అలిసిపోదాం శ్వాసలు తీసుకుంటూ
కానీ విరిగిన కొమ్మలని, పూలని
తేనెతో అతుకుదాం
ఏమో రేపిక్కడ ప్రపంచం కొత్తగా పుట్టొచ్చు !
© Dinesh muddada