...

10 views

తెలుగు భాష...
తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలతో...

అమృతం నిండిన భాష
ఆత్మీయత పంచు భాష
ఇలలోనే అందమైన భాష
ఈశ్వరుడే మెచ్చిన భాష
ఉయ్యాలలోని చంటిబిడ్డ కూడా
ఊ అంటూ పలికేటి గొప్ప భాష
ఋషుల తపస్సు వంటి భాష
ౠత్వము ఉన్నట్టి ఏక భాష
ఎన్నడూ వన్నె తరగని భాష
ఏ దేశమైనా చెక్కు చెదరని భాష
ఐక్యమై ఉండమని నేర్పుభాష
ఒద్దికైన పడుచువంటి భాష
ఓపికగ ఉండు బామ్మ లాంటి భాష
ఔషధమ్ము వలె సాయపడు భాష
అందరినీ దరిచేర్చు భాష
అః అంటూ అచ్చులు ముగియు భాష
ఇదే ఇదే నా తెలుగు భాష

...నక్షత్ర

© Nakshathra