...

7 views

నేర్చుకో...
నేర్చుకో నేర్చుకో నేస్తమా....

కొక్కరకో కొక్కరకొ అంటూ తెల తెల వారక ముందే లే చే కోడిని చూసి నేర్చుకో.....సమయం పాటించాలని తెలుసుకో.....

తెల్లని తెరలను దాటుకొని ఎర్రని
కిరణాలను ప్రసరింప చేసే ...ఆ సూర్యుడిని చూసి నేర్చుకో....
పక్కవారికి ఎప్పుడు కూడా వెలుగును ఇస్తు....ఉండాలని నేర్చుకో.....

అందమైన ఉదయాల మద్య వీచే..
చల్లని గాలిని చూసి నేర్చుకో....
ఎప్పుడు నవ్వుతూ....ఉండాలని..

నిదురించే జాబిల్లిని చూసి నేర్చుకో....
ఎంత కష్టం వచ్చిన కూడా రేపంటూ...నీకోసం వేచి ఉంటుందని..నేర్చుకో.....

నేర్చుకో నేర్చుకో నేస్తమా....కోయిల మాటలన్నీ ప్రకృతిలో ఉన్నాయని నేర్చుకో.....నేర్చుకో.....