మారిన వైనం (కథ)
మారిన వైనం (కథ)
______________
అవంతిక ఆలోచిస్తుంది . తాను ఆనాడు మారడానికి ఎంత మధన పడింది గుర్తుకువచ్చింది . అవసరం, సమయం , ఆరోగ్యం తనను మార్చింది. తనకు ఎంత ఇబ్బంది ఉన్న తన అన్నీ పనులు చకచకా చేసుకొని మాత్రమే నిద్రకు ఉపక్రమించేది . అప్పుడు మాత్రమే ప్రశాంతంగా నిద్ర పోగలిగేది. ఇంటి పని , పిల్లలపని, తన టీచర్ ఉద్యోగం అన్నీ ఏక కాలం లో ప్రణాళికతో సంభాళించుకోగలిగింది . అది ఫిబ్రవరి మాసం , తన 40 వ ఏటా తనకు పిరియాడ్స్ సమస్య చాలా బాధించింది. అంతకు ముందు ఓ రెండేళ్ళ నుండి సమస్య మొదలయింది. కాని ఇప్పుడు తీవ్రతరం మై నిలదొక్కుకోవటం అసాధ్యం అయ్యింది. డాక్టర్ సలహాతో హిస్టరెక్టమి చేయాలని తెలుసుకొంది . అన్నీ పరీక్షలు చేసి ఆపరేషన్ తప్పదు అని డాక్టర్ గారు తేల్చేసారు. తన జాబ్ షెడ్యూల్ చూసుకొని పిల్లల ఆన్యువల్ పరీక్షలు, పేపర్స్ కరెక్షన్, రిసల్ట్ డిక్లేరేషన్ , అయ్యాకే సర్జరీ కి ప్లాన్ చేసుకోవాలని నిర్ణయించుకొంది . ఒక నెలకు మందులు రాశారు డాక్టర్ గారు , కానీ వాడినా ఏం లాభం లేకపోయింది .
మార్చి లో పరీక్షలు అయ్యాయి. ఏప్రిల్ 23 నుండి సెలవులు ఇచ్చారు . మళ్ళీ డాక్టర్ దగ్గరి కెళ్తే కంప్లీట్ సర్జరీ ప్రొఫైల్ టెస్ట్స్ చేయాలని అన్నీ చేసి రెండు రోజుల్లో సర్జరీకి డేట్ ఫిక్స్ చేశారు. తాను అప్పుడు చీరలో ఉంది. డాక్టర్ అన్నారు అమ్మా నీవు ఒక నాలుగు నైటీలు తెచ్చుకోవాలి, ఆపరేషన్ తర్వాత చీరలు కట్టలేవు . కుట్లు మానేవరకు చీర కట్టటం కుదరదు అని చెప్పింది. కానీ అవంతిక అంతా వరకు నైటీ వాడలేదు. చెప్పింది కూడా , అలవాటు లేదు డాక్టర్ అని, డాక్టర్ అన్నారు కదా! ఇక్కడ నీవు ఆలోచించాల్సింది అలవాటు గురించి కాదు అవసరం గురించి , లేకుంటే ఆపరేషన్ తర్వాత నీకు కష్టమవుతుంది అని .
ఇక తప్పనిసరి పరిస్తితుల్లో నైటీలు కొన్నది. సర్జరీ అయ్యింది. నైటీలు వాడటం మొదలయ్యింది. కుట్లు త్వరగానే మానిపోయాయి . సెలవులు పూర్తయే వరకు తాను కొద్దిగ సత్తువ పొందింది. స్కూల్ ప్రారంభం నాటికి ఆరోగ్యం కొంత కుదు టపడింది . అలా మొదలయిన అవసరం, అలవాటుగా మరియు సౌకర్యంగా మారింది.
కొంత కాలం బాగానే గడిచింది. మెల్లగా కుడి చేతి భుజం నొప్పి ప్రారంభం అయ్యింది. ఎంతలా అంటే కనీసం చేయి పైకి లేపలేనంతగా! శరా మామూలే నరాల , ఎముకల డాక్టర్లు పరీక్షలలో తేల్చి చెప్పింది ఎంటంటే ఇది ఫ్రోజెన్ షోల్డర్ పెయిన్ అని , ఇక తన దిన చర్యలో చాలా మార్పు వచ్చింది . ఇంటి పనులు చేసుకోవటం చాలా కష్టం అయ్యింది . టైమ్ కు స్కూల్ కెళ్లటం ఒక సమస్య అయ్యింది. చీర కట్టుకోవటం ఒక గగనం అయ్యింది. చీర కట్టటం నొప్పితో అరగంట సమయం కన్న ఎక్కువయిన సరిగ్గా కుదిరేది కాదు. హ్యాండ్ బ్యాగ్ భుజానికి వేసుకుంటే నొప్పి బాధించేది. జడ వేసుకోవటం అస్సలు సాధ్యం అయ్యేదికాదు . ఇది చెప్పటం కన్న బాధ అనుభవిస్తేనే కాని తెలియదు . అది చాలా దన్నట్టు రిస్ట్ పెయిన్ ( కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ) బాధించింది. ఇక గ్లాసుతో నీళ్ళు తాగాలన్నా చాలా ఇబ్బంది అయ్యేది. హూక్స్ పెట్టటం, ఇంటికి తాళం వేయటం, గిన్నెలు కడగటం , చపాతీ ఒత్తటం లాంటివి బాగా ఇబ్బంది పెట్టేవి. ఏ చిన్న పని అయిన బట్టలు మడత పెట్టటం , దులపటం ఏది సాధ్యమయ్యేది కాదు. నొప్పి నొప్పి బాధించి చంపేది.
చాక్ పీస్ తో బోర్డు పై రాయలేక పోయేది. ఆమె భర్త సలహా మేరకు శెల్వార్ కమీజ్ లోకి మారింది . ఈ మార్పు తానున్న పరిస్థితికి కొంచెం నయంగా ఉండేది. భుజం, మణికట్టు నొప్పికి ట్రీట్మెంట్ , ఫిజియోథెరపీ లతో ఆరు నెలల బాధ అనంతరం కొంచెం కొంచెంగా కుదుట పడింది. ఇంతలా ఆహార్యం మారటానికి తన అవసరం, ఆరోగ్యం, కారణం మయ్యింది. ఈ మార్పు తనకు చాలా అవసరం కూడా అయ్యింది . కానీ మారటానికి ఎంతగా మధన పడింది . అప్పుడప్పుడు గుర్తుకు
వస్తూనేవుంటుంది . ఏదైనా మార్పు మంచి కోసం , అవసరం కోసం, ఆరోగ్యం కోసం అనివార్యమయితే దాన్ని సంశయించక స్వాగతించాల్సిందేనని , దానికి అలవాటు పడాలని అవంతిక తెలుసుకొంది .
_____________
సంధ్య సుత్రావె
SANDHYA SUTRAVE
© sandhya sutrave