...

7 views

మరో అవకాశం... పార్ట్-1
అతని కళ్ళు దేనికోసంమో
వెదకు తున్నాయి.....
చేతిలో ఉన్న కార్డు ను తేరాపార చూసి.......
ఇంటికి వెళ్లి... తలుపేసుకొని పక్క మీద పడుకుని ఉండగా నిద్ర మత్తుతో,
కళ్ళు.. మూతలు పడి.. మగతగా ఉంటే.. కళ్ళు ద్వారాల్లా మూసుకుని
కాలానికి తలుపు తెరిచాయి.......................
*********************
***************
ఐదేళ్ళ క్రితం...
************************************************************

రేయ్ యదవా లేరా! టైమవుతోందీ అంటూ తన అన్నను నిద్రలేపుతోంది...
చెల్లి సునీత.... ఏంటే పొద్దన్నే..
అంటూ విసుక్కున్నాడు.. శివ...
అమ్మ, మార్కెట్ కి వెళ్ళమంది...
ఏ నువ్వు ఊరేగచ్చుగా..
చిరాకుగా అన్నాడు...
అమ్మో......
నేనా.... నా మేకప్ లేకుండా పోతే బావుండదు.....
ఇప్పుడు ఏదో బావున్నట్టు అంటూ సునీత జుట్టు పట్టుకుని చెదరగొడతాడు....

నాతో తరవాత లొల్లి గానీ, ముందు
నువ్వు బయటికి నడు...అని చేతిలో
డబ్బు పెట్టి తరుముతుంటే పోవే
రాక్షసీ అంటూ గుమ్మం దాటి పోతుంటే పోరా అనుకుంటూ....
సునీత వంట గదిలో అమ్మ దగ్గరికి వెళ్ళింది......


డబ్బులు ఎడమచేతి వైపు జేబులో పెట్టుకుని, జారిపోతున్న లుంగీని,
మోకాలు దాక కట్టుకుని.......
తలపై ఉన్న జుట్టను స్టైల్ గా
చేతితో సవరించు కుంటూ,
మార్కెట్ వైపు... నడిచాడు...
..................................................................................కూరగాయలు సంచి ...చేతిలో పట్టుకుని వస్తుంటే..
చిరుగాలి కి అది ఊగుతూ ఉంది...
ఇంటికి వచ్చిన తరువాత...

...................
.......................
టిఫిన్ చేస్తున్న శివ ని నాన్న శేఖరం
నాన్న నువ్వు ఈ ఇంటర్వ్యూ అయినా
ఫేస్ చేసి.... జాబ్ తెచ్చుకోరా..
చెల్లికి సంబంధాలు చూస్తున్నాము..
అలాగే నీకు కూడా.... వెతుకుతున్నాం..
తను సొంతంగా స్టారప్ పెట్టింది....
వచ్చే వాడితో కలసి ......
కెరీర్ స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంది...
నువ్వు మాత్రం ఖాళీ.. గానే ఉన్నవ్
అంటుంటే
ఈసారి మాత్రం వస్తుంది నాన్న..
కంపెనీ మనకు తెలిసిన వాళ్ళదే
.......అంటాడు.. చెయ్యి కడుక్కొని
చేతికి వాచ్ పెట్టుకుని.....

ఒసేయ్ రాక్షసీ రావే ఇంటర్వ్యూ కి
వెల్తున్నా...... అంటూ....
చెల్లినికెకేసాడు.....శివ...బూట్లు...
కట్టుకుంటూ.....
ఇదిగో వస్తున్నా అంటూ గ్రీన్
చుడిదార్ లో అన్నయ్య కు
ఎదురు వచ్చింది...
........
రేయ్ ....గ్రీన్ డ్రస్ లో వచ్చాను..
నీకీ జాబ్ గ్యారంటీ....
సాయంత్రం..
వెన్నీలా...ఐస్ క్రీమ్..
నా లైఫ్ లో ఏ వెన్నెల
లేదంటుంటే
దీనికి వెన్నీలా కావాలట అని మనసులో అనుకుని ,
సరే తెస్తాలే... అంటూ...
బైక్ స్టాట్ చేసి.. రయ్,రయ్ మంటూ
నడిపసాగాడు.....

బైక్ నిదానంగా నడుపుతూ ఉంటే...
ముందు నుంచి ఓ స్కూటీ వచ్చి....
బైక్ ను ఢీకొని ఇద్దరు కిందపడ్డారు.....
చుట్టు ప్రక్కల వారు వీళ్ళకు సాయం చేసారు........

అసలు నువ్వే.. వచ్చి.. నా బైక్ ని గుద్దింది,కాదు నువ్వే నాకడ్డం వచ్చావని ఇద్దరూ అరగంట సేపు.
అలాగే ఒకరినొకరు బండ బూతులు తిట్టుకొంటూ ఎవరి గమ్యం వైపు వారు.. వెళ్ళిపోయారు...
........................
......................
మరో అరగంట సేపు ప్రయాణం తరువాత.......
ఆఫీసులో అడుగు పెట్టి,
ఇంటర్వ్యూ కు వచ్చిన అబ్బాయిల వద్దకు వచ్చి ఫైల్స్ చూసుకుంటున్న
అబ్బాయితో మాట కలిపాడు..
శివ గొంతు వినగానే... ఆక్సిడెంట్
చేసిన అమ్మాయి..... నందిని... శివను
చూసి ఆశ్చర్య పోతూ, అతన్ని చూసి చూడనట్లు ముఖం తిప్పుకొని అటు వైపు తిరిగింది. ......

ఎదురు గా ఆ అమ్మాయి కనిపించడంతో షాక్ తిని,
ఈ మధ్య దరిద్రాలు కూడ జాబ్ లు
చేస్తూన్నాయి.. బ్రో..అంటే
అవును.. బ్రో...నిన్నే నా జాబ్ పోయింది.... అంటూ అతని వైపు చూస్తూ ఉంటే శివ ఆలోచన లో పడ్డాడు...... అతని మాటలు విని నందిని ఇలియట్ అంటూ తన మనసులో తిట్టుకుంటుంది......
ఇంతలో నందిని వంతు వస్తుంది...
మరికాసేపటికి తను బయటికి వాళ్ళ నాన్నకు సెలక్ట్అయ్యానని
ఫోన్ చేసి చెబుతుంది... .....

మన శివతో పాటు అతని పక్కన ఉన్న
వాళ్ళంతా ఇంటర్వ్యూ కు సెలక్ట్ అవుతారు........
ఆనందం తో శివ చెల్లికి రెండు కిలోల,
ఐస్ క్రీమ్, అన్నయ్య పిల్లలకు డెయిరీ
మిల్క్ చాక్లెట్ లు తల్లి, వదినకు
పట్టు చీరలు,అన్నీ కొనుక్కొని
ఇంటికి వచ్చాడు.....
అమ్మ నాన్న లు కు,
అన్న వదినలకు,
కాళ్ళకు నమస్కారం చేసి
తెచ్చిన వస్తువులు పంచి పెట్టాడు...

తన
గదిలోకి వచ్చి బట్టలు
మార్చుకుంటుంటే
నేను చెప్పింది చెప్పినట్లు నట్లు
నీకు జాబు వచ్చిందిగా
ఈ సునీతఅంటే
ఏమనుకున్నావ్ గాడెస్ అని నవ్వుతూ ఉంటే గాడెస్ కాదు డెవిల్ నువ్వు
వెళ్ళే దారిలో ఓ అమ్మాయి
డాస్ ఇచ్చింది...
థాంక్ గాడ్ నా కేమీ కాలా ...అన్నాడు...
ఎవరా. అది..

ఆసక్తిగా అడిగింది సునీత....
హా..
..
అదో మెంటల్ కేస్
స్లోగా వెళుతున్న నాకు డ్యాష్
ఇచ్చింది.....
పైగా నన్నే దబాయించింది..
..........
అవునా ఇంతకీ అసలు ఈ విషయం
అమ్మ వాళ్ళకి కూడా చెప్పావా

హు.. లేదు...
వాళ్ళిప్పుడే
నాకూ జాబ్ వచ్చిందనే హ్యాపీ మూడ్
లో ఉన్నారు.....
చెడగొట్టడం ఎందుకు అని చెప్పలేదు
నువ్వు చెప్పకు
అంటే
సరేనని చెప్పి అక్కడ నుంచి నేరుగా తన తండ్రి వద్దకు వెళుతుంది సునీత ...

..........................................(ఇంకా ఉంది ).......by......... govind@.......


















© All Rights Reserved