...

8 views

ACCIDENTAL LOVE💞💞💞💞💟💟💟💟❣️❣️❣️❣️❣️

"నేనెవరో తెలుసా?"



"ఇంత అందంగా ఉన్నావ్ కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే...."అతను సిగరెట్ పొగ వదులుతూ "ఏ ఏరియా?" అన్నాడు.



ఆమె అతని చేతిలో ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ ని లాగుతూ, కంటి నుండి వస్తున్న నీటి ని ఆపడానికి ట్రై చేస్తుంది.



"ప్లీస్, నన్ను వెళ్ళనివ్వండి" ఆమె మాటల్లో నిస్సహాయత.....



"ఇందాక అంత పొగరుగా నేనెవరో తెలుసా అన్నావ్ కదే, చెప్పు.... నువ్వు ఎవరు , ఎక్కడుంటావ్, ఇంట్లో ఎవరెవరు ఉంటారు, మేము నలుగురం ఎప్పుడు రావచ్చు, హ హ హ" గట్టిగా నవ్వుతూ పక్కనున్నవాడి భుజం మీద తట్టాడు.



ఆమె లో ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైంది, కింద పడి చేతులలో ముఖం పెట్టుకొని ఏడవ సాగింది.



చుట్టూ ఉన్న జనం, ఎప్పటిలాగే తమ అతి ముఖ్యమైన పనుల్లో బిజీ గా ఉన్నారు, ఒక ఆడదాని పరువు పోవడం అనే అంత చిన్న విషయం కోసం టైం వేస్ట్ చేసేంత మూర్ఖులు కాదు వాళ్ళు.



కానీ అప్పుడే షాపింగ్ చేసి బయటకి వస్తున్న విహారి కి ఫారిన్ డేలిగేట్స్ తో మీటింగ్ తప్ప పెద్దగా ఇంపార్టెంట్ వర్క్స్ ఎం లేకపోవడం వల్ల, ఇది చాలా ముఖ్యమైన విషయం అనిపించింది.



ఆ నలుగురి లో రెండో వాడు ఆమె భుజం పై చేయి వేయబోయాడు.......

ఈలోపు విహారి తన పక్కనే ఉన్న కొబ్బరిబోండం అతని మీదకి విసిరాడు.....షిట్ అది మిస్ అయింది....ఎందుకంటే ఆ రెండోవాడు అప్పటికే కుప్పకూలిపోయాడు.........



అతని కాళ్ళ మధ్య చేతులు పెట్టుకుని విలవిల లాడుతున్నాడు......నిదానంగా ముఖం మీద చేతులు తీసి చిన్న నవ్వుతో లేచి నుంచుంది వింధ్య.....





అక్కడ ఉన్న ఎవ్వరికి ఏమి అర్థం కావడం లేదు, కానీ ఆమె చేతిలోంచి కురుస్తున్న పిడిగుద్దుల శబ్దం మాత్రం వినబడుతుంది.

అంతా fastforward లో జరుగుతున్నట్టు ఉంది.... ముగ్గురు కిందపడి కదల్లేకపోతున్నారు...ఒక్కడు పారిపోడానికి పరిగెడుతూ విహారి వెనుక నుంచున్నాడు. విహారి అతన్ని పట్టుకోడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అతను విహారి ని వెనక నుంచి గట్టిగా పట్టుకుని అతని చేతిలోని బాగ్ తీసుకొని వింధ్య మీదకి విసిరాడు....ఆమె వైపు వస్తున్న ఆ బాగ్ ని పట్టుకొని మెరుపు వేగం తో అతని తలపైన బలంగా కొట్టింది ఆమె .......



విహరికి ఇదంతా కలలాగ ఉంది....అతని కంటి పక్కనుంచి వెళ్లిన తన బాగ్ ని చూసేలోపు అతని షర్ట్ మీద అంతా రక్తం.......





అతను స్పృహ తప్పి పడిపోయాడు.........


© All Rights Reserved