...

12 views

కుల పిచ్చిలో అడుగంటి పోతున్న మన భారతదేశం..
మన భారతదేశంలో 6,346 కులాలు ఉన్నాయి. మనుషులు చేసే వృత్తులను బట్టి...కులాలను సృష్టించారు. మనిషి బ్రతకాలంటే కావాల్సింది గాలి, నీరు, ఆహారం...

వాగు వంకకు లేని కులము
ఎండ వానకు లేని కులము
చెనుకు చెలకు లేని కులము
చెమట చుక్కలు లేని కులము
మన జీవితాలలోకొచ్చింది - మానని గాయం చేసింది

అందని నింగికి లేని కులము
మోసె నెలకు లేని కులము
నిప్పుకి నీరుకు లేని కులము
గాలి ధూళికి లేని కులము
జనం ఇంటిలోకి వచ్చింది... రణం మంటలను లేపింది
పచ్చని ఊళ్ళలో చిచ్చును పెట్టి... పోట్లాటలకు సై అంది..
****
అప్పుడెప్పుడో అంబేద్కర్ గారు, united india (అందరూ సమానమే ) తీసుకురావాలని... వెనకబడిన కులాలకి 25% రిజెర్వేషన్ కల్పించాలని, 10 సవంత్సరాల తరువాత ఉన్న పరిస్థులని బట్టి రాజ్యాగంలో సవరణ చెయ్యొచ్చు అని రాసారు. కానీ మన రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్ధం కోసం ఇంకా దాని పొడిగిస్తూ వస్తున్నారు గాని దాన్ని ఇప్పటి వరుకు ఎవరు సవరణ చెయ్యలేదు.

పంచ భూతలదే కులమురా..... కులం పంచాయతీ మనకెందుకురా...
సీట్ల కోసమె పదవి కోసమే... మనలో మనకు గొడవలు పెంచి.... గద్దెక్కలని నాయకనక్కలు...
కుల సంఘాలను పెట్టారు - సంఘర్షణలను పెంచారు.
వర్ణబోదన చేసారు - వైరి భావన పెంచారు
గల్లీలోన మనమంతా గల్ల గల్ల పట్టుకుంటేరా...
ఢిల్లీలోన వారంతా పక్కపక్కనే కుసుంటారు...
మనకెందుకురా... ఈ కులం..??
*****
అమెరికా లో నల్ల జాతి వాళ్లకు రిజెర్వేషన్ కలిస్తాం అంటే.. మాకు వద్దు మేము పోటీపడతాం అని చెప్పారు. అలా పోటీపడుతున్నారు కాబట్టే, ఆ దేశం అలా అభివృద్ధి చెందింది. మన దేశంలో మాత్రం కులం పిచ్చి ఎక్కువైయి.... రోజు రోజుకు అడుగంటిపోతుంది. కాపు కులం వాళ్ళు పోటీపరీక్షా రాస్తే...వాళ్ళు ఎంత మెరిట్ అయినా వాళ్ళని తీసుకోవడం లేదు. తక్కువ కులం అంటూ, రిజెర్వేషన్స్ అంటూ...పరీక్ష ఫెయిల్ అయినా వారికీ కూడా ఉద్యోగం ఇచ్చే ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఆ రిజర్వేషన్స్ పోవాలి అంటూ చాలా మంది దీక్షలు చేసిన వారు కూడా ఉన్నారు. ప్రతి కాపు వాళ్ళు అనుకుంటున్నారు ఈ రోజు "రిజెర్వేషన్స్ పోవాలి అంత ఒకటే, మెరిట్ కె ఉద్యోగం ఇవ్వాలి అని ". అలా ఆలోచించే వాళ్లే, అంత ఒకటి అవ్వాలి అనుకునేవారే... ఒక్క ప్రేమ విషయంలో మాత్రం అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఎందుకు కులం అంటూ మతం అంటూ... ప్రేమికులను విడదీస్తున్నారు. కులాంతర ప్రేమ జంటకు చావే సమాధానమా?

వాళ్ళకి పిల్లల సంతోషం, ప్రాణం కంటే, వాళ్ళకి కులమే ముఖ్యమా?ఆ కుల పిచ్చిలో ఎందరో అమాయకులు బలైపోతున్నారు. వేరే వాళ్ళను చేసుకోలేక... వాళ్లే విషం తాగి చనిపోతున్న వాళ్లను ఎంతో మందిని మనం చూస్తున్నాం. ఎన్నాళ్ళు ఇలా కులం వల్ల... చదుకోవాలి అనుకునే వారు కూడా చదువుకోలేకపోవడం, మనస్ఫూర్తిగా నచ్చిన వాళ్ళని పెళ్లిచేసుకోలేక........చచ్చిపోవడం.

మనం ఎంత చెప్పిన మన పేదవాళ్ళు ఎలాగో మారరు. మారితే మంచిదే. ఒకవేళ వాళ్ళు మారకపోతే మనం అయినా మారాలి.....మనం మారితే, మన భవిష్యత్తులో అయినా అలా జరగడం తగ్గుతుందిగా. మార్పు అనేది ఒకరి నుండే మొదలవుతుంది. అది మీ నుండి అయినా కావ్వొచ్చు.. నా నుండి అయినా కావ్వొచ్చు. మీరు మీ పిల్లలకి నేర్పించండి "అంత సమానం అని, అందరితో చదువుల్లో పోటీ పడాలి అని... రిజెర్వేషన్ ద్వారా మీకు సీట్ ఇస్తే వద్దు అని.. మేము చదవుకోగలం ...మమల్ని సోమరిపోతులను చెయ్యదు "అని చెప్పండి.

ప్రతి రాయకీయ నాయకుడు సీట్ మీద ఆశతో నే అధికారం లోకి వస్తున్నాడు. ఒకరు కూడా జనాల కోసం పని చేసే వాడు లేడు..ఎవడి స్వార్ధం వాడిదే. మన భవిష్యత్తులో అయినా సీట్ మీద అధికారంతో కాకుండా మన కోసం పని చేసే రాజకీయ నాయుడు వస్తే.." ముందు రిజెర్వేషన్స్ అన్ని పూర్తిగా తీసేసి.. మొత్తం నాలుగు కులాలుగా విభజించి

*1.నిరుపేద కులం (కొంచం కూడా పొలం లేని వారు ) వారికీ ఆహారం, బట్టలు, వాళ్ళ పిల్లకి చదువు, సాధ్యమైనంత వరుకు వాళ్ళకి అన్ని అందచెయ్యాలి. వీరిని సోమరిపోతులను చెయ్యకుండా... వీళ్ళు సొంతగా సంపాదించుకునే వరుకు...వీరికి అండగా ఉంటే చాలు.

*2. పేద కులం : 50 సెంట్లు కంటే తక్కువ ఉన్న వారు. వీరికి ఎం అయితే అవసరమో అవి అందచెయ్యాలి.

*3. మధ్య తరగతి కులం : ఒక రెండు ఎకరాల లోపు ఉన్న వారు. వీరికేం అవసరమో అవి ఇవ్వాలి.

*4. ధనవంతుల కులం: 2ఎకరాల పైగా ఉన్నవారు..... ఎదుటి వారి నుండి ఎం ఆశించారు... వాళ్ళు అన్ని తెచుకోగలరు.

ఉద్యోగం, ర్యాంక్ అన్ని మెరిట్ ని బట్టి ఇచ్చి...ఎ కులమైన ఒకటే అని ప్రకటించి.. ఆ నాయకుడు సీట్ దిగేలోపు.. దేశం అంత నాలుగోవ కులానికి వచ్చి... సమానత్వం ఏర్పడి, ప్రశాంతవాతావరణం వచ్చిననాడు.... మన దేశం బాగుపడుతుంది. కానీ ఒక రాజకీయ నాయకుడు కూడా లేడు... ఈ విధంగా చెయ్యడానికి.

మీరు నా ఆలోచనను అంగీకరిస్తే... మన పై అధికారులకు ఇది చేరే వరుకు షేర్ చెయ్యండి. 🙏

గాలికి నీటికి లేవు బేధాలు ... మనుషులకి ఎందుకింత కులమత విబేధాలు????



© Vinni🖤