...

7 views

#కరోనా సమయంలో
హాయ్ ఫ్రెండ్స్,ఈ కరోనా సమయంలో నేను చాలా నేర్చుకున్నాను.మీకు నేర్పమంటార మరి...నాతో పాటు నా కథను వినండి మొదటగా తరువాత మీకు నేర్పిస్తాను.....మరి నా కథ చెప్పనా.....

నా పేరు చిన్ను,నాకో అన్నయ్య కూడా ఉన్నాడు,అన్నయ్య పేరు రవి.రవి ఫిఫ్త్ క్లాస్,నేను ఏమో థర్డ్ క్లాస్ చదువుతున్నాం.ఇక అమ్మ హౌస్ వైఫ్,నాన్న చిన్న కిరాణా షాపు .అమ్మ ఇంట్లో బట్టలు కుడుతూ,నాన్న షాపు చూసుకుంటూ ఉంటేనే ఇల్లు గడుస్తుంది... మేము ఉండేది సీతా పురం అనే ఒక మారుమూల చిన్న పల్లెలో.పల్లె అంటే చెప్పనక్కర్లేదు సౌకర్యాలు తక్కువగా ఉంటాయి....

మా జీవితాలు రోజు వారివి,అలాంటి సమయంలో కరోనా మహమ్మారి కమ్మేసి అందరి జీవితాలను చిదిమేస్తుంది...ఇక స్కూల్స్ కూడా క్లోజ్ చేశారు.దాంతో అన్నయ్య ,నేను ఇంటి దగ్గరే ఆడుకునే వాళ్ళం,ఇలా ఉండగా కొన్ని రోజుల తరువాత పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అంటూ గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేశారు.నాన్న పిల్లలని బాగా చదివించాలి అనే ఉద్దేశ్యంతో ఓ మాదిరిగా ఉన్న ఒక కార్పొరేట్ స్కూల్ లో చేర్పించారు నన్ను,రవి నీ...కార్పొరేట్ స్కూల్ వాళ్ళు వదిలేస్తారా "మీ పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ వినిపించండి అంటూ" ఫోన్ చేసి మరీ ఆర్డర్ వేశారు.కానీ మా ఇద్దరికీ ఆన్లైన్ క్లాసెస్ వినడానికి మొబైల్ ఉండాలిగా,నాన్న కి మాత్రమే చిన్న మొబైల్ ఉంది,అది కేవలం మాట్లాడటానికి మాత్రమే ఉపయోగ పడుతుంది.

ఇక ఎలా ఆన్లైన్ క్లాసెస్ వినగలం మేము.అమ్మ మేము బాధ పడకుండా వుండటం కోసం మమ్మల్ని ఆరోజుకి బుజ్జగించి నిద్ర పుచింది ఇద్దరినీ. మరసటి రోజు నాన్న ఉదయం నిద్ర లేపి ఇంటి చుట్టూ రవిని,నన్ను వాకింగ్ చేయించాడు,తరువాత చెట్లు నాటించాడు."ఏంటి నాన్న ఇవన్నీ కొత్తగా అని" నేను,రవి అడిగాము. అప్పుడు నాన్న "మీకు ఆరోగ్యం కోసం,ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.అంతేకాకుండా మీకు మైండ్ కూడా రిఫ్రెష్ అవుతూ ఉంటుంది ఉదయం పూట " అని చెప్పారు.చెప్పాక ఇక త్వరగా స్నానం చేసి రెడీ అవుదాం అని చెప్పాడు, అప్పుడు నేను అప్పుడే స్నానం ఏంటి నాన్న అంటే అందుకు నాన్న మంచి అలవాట్లను చిన్న వయసు నుండే నేర్చుకుంటే అవే అలవాటు అవుతాయి అని చెప్పాడు.మేము త్వరగా రెడీ అయి వచ్చే సరికి అమ్మ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది,అందరం కలిసి తిన్నాం.

ఇక అమ్మ నాకు ఇంటిని ఎలా సర్ది పెట్టాలి అని నేర్పడం మొదలు పెట్టింది,అన్న కు మట్టి తో ,గోధుమ పిండి తో బొమ్మలు ఎలా తయారు చేయాలో నేర్పడం మొదలు పెట్టింది.ఏ విధంగా చేయాలి,ఎలా చేయాలి ,ఎంత సమయంలో చేయాలి అని రూల్స్ పెట్టి అమ్మ వంట పని చూసుకునేది..వంట పని పూర్తి అయ్యాక ఇద్దరికీ నేర్పించిన వాటి ప్రయోజనాలు చెప్పేది...

సాయంత్రం వేళలో వీదిలో పిల్లలతో ఆటలు ఆడుకునే వాళ్ళం.రాత్రి అయ్యాక నాన్న,అమ్మ ఇద్దరు కూడా నీతి కథలు చెప్పే వారు....అల నాన్న,అమ్మ ఇద్దరు కూడా మాకు ప్రతి రోజు కొత్తగా చూపించేవారు. ఇలా ప్రతి రోజూ కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాం,అమ్మ కి ఇంటి పనుల్లో సహాయం చేయడం నేర్చుకున్నా.కొత్త కొత్త పనులతో పాటు..విలువలను కూడా నేర్పించేది,ఇలా కొత్త విషయాలు నేర్చుకునే వాళ్ళం లాక్ డౌన్ లో.

ప్రతి రోజు కొత్త పనులతో,కొత్త అలవాట్లతో సాగేది మా జీవితం...అప్పుడే వినాయక చవితి పండుగ వచ్చింది...నాకు,రవి కి వినాయక పండగ అంటే చాలా ఇష్టం.కానీ లాక్ డౌన్ కారణంగా సంతోషంగా జరుపుకొలేమో అనుకుంటూ...ఉంటే,అమ్మ మాకు ఒక ఆలోచన చెప్పింది.దాంతో రవి మన్ను తెచ్చి పెద్ద వినాయకుడిని తయారు చేశాడు,దానిని ఇంటి ముందర కూర్చో పెట్టాం.అమ్మ పాత చీరలని తీసుకొని అందంగా కుట్టి వినాయకుడికి పరదా లా చేసి,వాటి చుట్టూ అందమైన ఫ్లవర్స్ తో అలంకరించాను నేను,ఇదంతా చేయడానికి ఇద్దరికీ అమ్మ చాలా సహాయం చేసింది...

వినాయకుడిని మూడు రోజులు కూర్చో పెట్టీ బాగా జర్పుకోవాలి అనుకున్నాం అన్న,నేను.సాయంత్రం వేళలో వీది పిల్లలని పిలిచి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఆడించాము,చుట్టూ పక్క వారు కూడా పూజకని ప్రసాదాలు,టెంకాయలు తెచ్చి పూజ చేపించారు.ఇలా రెండు రోజులు చాలా బాగా సంతోషంగా గడిపాము.ఇక చివరి రోజు పిల్లలకి ,పెద్దలకి కలిపి ఆటలు ,పాటలు ఆడించాం,తరువాత చీటీ ల ఆట పెట్టాము.చీటీ లో ఏమీ రాసి ఉంటే అది చేయాలి,అల ఆడుతుండగా చీటీ తీసే వంతు నాకొచ్చింది.ఆ చీటీ లో స్పీచ్ ఇవ్వాలని రాసి ఉంది,నేను అందరి ముందర నిల్చొని .....
"అందరికీ నమస్కారం!మొదటిగా అందరికీ నా కృతజ్ఞతలు,ఎందుకంటే చిన్న పిల్లలు చేసేదిలే అని అనుకోకుండా ఊర్లో అందరూ ఈ ప్రోగ్రాం కి వచ్చారు.ఈ పండుగని అందరం జరుపుకున్నాము నాకు చాలా సంతోషంగా ఉంది,ఆ వినాయకుడు కూడా ఆనందంగా ఉంటాడు.మేము ఈ కార్యక్రమాన్ని చేయడానికి మా తల్లి తండ్రులు మాకు చాలా హెల్ప్ ఫుల్గా ఉన్నారు.ముఖ్యంగా మా అమ్మ మా ఇద్దరికీ ముందుండి అన్ని మా చేతులతోనే చేయించింది.లాక్ డౌన్ లో మా అమ్మ,నాన్న మాకు చాలా నేర్పించారు,ఎన్నో కొత్త విషయాలు నేర్పించారు.అందరిలో ఎలా మాట్లాడాలి,ఎలా మెలగాలి అంటూ చాలా బాగా నేర్పించారు.మా తోటి స్నేహితులు అందరూ కూడా ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు, కానీ మాకు ఆ అవసరం తెలియకుండా చేశారు మా అమ్మ,నాన్న.మా అన్న,నేను ప్రతి రోజూ ను కూడా చాలా ఎంజాయ్ చేశాం.ఈ పండగను మాతో ఇంత బాగా జరిపి నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అని నా మాటలని చెప్పాను....అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు,ఆ చప్పట్లు వింటున్నంత సేపు చాలా సంతోషంగా ఉంది నాకు.అందరూ చూస్తూ వుండగానే మా ఊరి సర్పంచ్ గారు నా స్పీచ్ నచ్చి ఆయన పెద్ద మొబైల్ బహుమతిగా ఇచ్చారు.నాకు మొదటి బహుమానం తీసుకున్న ఆనందం,అమ్మ,నాన్న కూడా చాలా సంతోష్ పడ్డారు.

ప్రోగ్రాం అంతా అయిపోయాక వినాయకుడిని తీసుకొని అందరం కలిసి నిమర్జన చేశాం,సాయంత్రం ఎవరి ఇంటికి వారు వెళ్లి పోయాం....

నీతి: హయ్యర్ క్లాసెస్ కి ఆన్లైన్ క్లాసెస్ అవసరం కానీ చిన్న పిల్లలకి అవసరం లేదు.చిన్నప్పుడు పిల్లలకి విలువలు నేర్పిస్తే చాలా బాగుంటుంది