...

7 views

రాజ్యం....
అడవిలో.... చెట్ల ఆకులు మీద అడుగుల శబ్దం విని నిశ్శబ్దం కూడ
భయపడింది... ...ఆ అడుగుల ధ్వని,
భయానకాన్ని సృష్టింస్తోంది..

దూరంగా ఉన్న పొదలు మాటున ,
నక్కల కూతలు,
తిత్తిరి పక్షులు అరుపులు,
అడవిని గందరగోళం చేస్తున్నాయి...
ముగ్గురు వ్యక్తులు అడవిలోంచి
ఊరు లోకి ప్రవేశించారు....

అందులో ఒకరు పుట్ట మూగ చెల్లి,
అంధ, అన్నయ్య ,
గర్భవతి మహిళ,
పుట్టింటి కి వచ్చింది రాజ్యం మూడో కాన్పుకు,
పోషించే వారు లేకపోయినా,
అయిన వాళ్ళ దగ్గర ఉంటే,
కొంచెం గుండె నిబ్బరం దొరుకుతుంది అని రాజ్యం ఆశ,
కారకుడు నిత్య పానీయిడు ,
తిరుగుబోతు, కరవటం తప్ప, మరొకటి ఎరుగని వాడు..
వాడి సరదాలకు, రాజ్యం సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన.
రెండు కోకలతోనే
రెండు కునలకు జన్మనిచ్చింది..

మగాడు మెగుడవ్వాలి కానీ మృగం
కాదు కదా...
వర్షం కురిసిన రాత్రి వేళ రాజ్యం. ..
మరో ............


కన్నవాళ్ళకు, నోరు తప్ప, ఒంట్లో జీవం
లేదు,
తోబుట్టువులు, వదిన గారు అన్న కలవరింతలకు, కరణం గారి కొడుకు తో షికారు కెల్లింది క్షమించాలి. ఆ పదం రాయటం ఇష్టం లేదు...
చెల్లి పలుకు లేని బొమ్మని ఎవరూ సాహసించలేదు.....

చివరగా తనూ బంగారం బొమ్మ,
కసాయి కంసాలి లాంటి భర్త
చేతుల్లో పెట్టి బారం తీర్చుకున్నారు
అమ్మ, అయ్యలు,ఆ పాపం ఇద్దరి.
కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చేలా
చేశాయి....

.................అక్కడ తనకు కన్నీళ్ళు తప్ప వేరే బంధువులు లేరు, అత్తమామలు పెనిమిటి పైశాచిక చర్యకు... మొగుడి చిన్న నాడే
ఘోర చావు చచ్చారు,

అన్ని తెలిసి కూడా తండ్రి
తాళి తో గొంతు కోసి
కడుపు నిండా తిండి లేక పోయినా ఫర్వాలేదు గానీ ఇట్టాంటోడు లేక పోతే
బతుకు ఉండదని... సెప్పిండు
ఆ క్షణంలో తండ్రి కన్నీళ్ల ముందు తన
కష్టాలు చిన్నదిగా అనిపించింది రాజ్యనికి.....

ఒల్లంతా పంటి గాట్లతో, ఇళ్ళు చేరిన
కూతురు ను చూసి కన్నీళ్లు పెట్టుకుని
గొళ్ళుమంది తల్లి......

తన కా స్థితిలో
అంతకన్నా ఎక్కువ శక్తి లేదు,
తండ్రి ములుగులు,
చెల్లి ఇబ్బందులు,
అన్న పిచ్చి మాటలు,

ఆమెకు ఆ ఇంట్లోకి
స్వాగతం పలికాయి..

............................................
......................by..... govind@...











© All Rights Reserved