...

18 views

రైతు కష్టార్జితమే...మన జీవితం..
ఒక సామాన్య రైతు అంటే అందరూ చాలా చిన్న చూపు చూస్తారు. ధనవంతుడు కి చాలా గౌరవం ఇస్తారు. కానీ ఒక రైతు లేకపోతే ఒక రోజు కూడా గడవదు.
నారు వేసిన దెగ్గర నుండి వరి కోసేవారుకూ, రైతు తన పంటను రాత్రి పగలు కంటికి రెప్పలా కాపాడుకుంటాడు.
రాత్రులు పొలం దెగ్గర కూర్చొని నిద్రపోకుండా పంటను, పురుగులు కానీ ఇంకేమైనా జంతువులు వచ్చి పాడుచేస్తాయేమో అని కన్ను రెప్ప కూడా వెయ్యకుండా,పంటను చూసుకుంటూ, పొలంకి నీరు పెడుతూ ఉంటాడు. ఉదయం మళ్ళీ వచ్చి పొలంలో పక్షులు ఏమైనా వచ్చి వరి మీద వాలి నాశనం చేస్తాఏమో అని వాటిని వాలకుండా చూసుకుంటాడు. పంట చేతికి రావడానికి 6నెలలు నిద్ర ఆహారాలు మానేసి చాలా కష్టపడతాడు. పంట చేతికి వచ్చాక తాను తినడానికి కొన్ని బస్తాలు ఉంచుకొని, మిగతావి అమ్ముకుంటాడు. ఒడ్లు కొనేవారు చాలా తక్కువ తో కొనుకొని, ఎక్కువలో అమ్ముకుంటున్నారు. కొనే వాళ్లు బానే ఉంటారు, తీసుకునే వారు బానే ఉంటారు. పంట వేసిన రైతుకు మాత్రం, తన కష్టార్జితానికి తగ్గ డబ్బులు చేతికి రాకపోగా వారికీ గౌరవం కూడా ఎవ్వరు. కానీ వాళ్లకి అర్ధం కాదు ఒక రైతు లేకపోతే రోజు గడవదు అని. పొలం మీదే పంచ ప్రాణాలు పట్టుకున్న రైతులు, పంట చేతికి వచ్చిన, అనుకున్న ఆదాయం రాక, చేతికి వచ్చిన పంటలో సగం అన్యాయంగా పెత్తందారులు తీసుకుంటుంటే, ఎం అనలేక, రోజులు గొడవక, పొలానికి వేసిన మందులే తాగి ఆత్మహత్య చేసుకుంటున్న రైతులెందరో...
రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది...
మనం తినే ప్రతి గింజ, రైతు యొక్క కష్టార్జితం... దేశానికీ అన్నం పెడుతున్న రైతుని గౌరవించండి....🙏🙏🙏

Please Save formers🙏🙏🙏!!!!!

#facts #saveformer

© Vinni🖤