...

7 views

కిరీటం - పార్ట్-4
ఆ రోజు సాధారణ పౌర్ణమి.......
రేరాజు తనలో తానే స్వయంగా
మెరుస్తూ,
జీవకోటిని
వెన్నెల మైకంలో ముంచుతున్నాడు.......

వెంట చింటూ ను తీసుకొని
మాళిని ......తమ ఇంటికి దగ్గరగా ఉన్న
జలపాతం వద్దకు.. పరిగెడుతుంది...
నీరు ఆమె మనసు లా స్వచ్ఛంగా
ఉన్నాయి...........

చింటూ పేపర్ తో నీటిలో పడవలు చేసి ఆడుకొంటూ ఉంటే ,
మాళిని నార బట్టలు ధరించి,
జలపాతం కింద......
తడుస్తూ.....
కిల,కిలా ,నవ్వుతూ,

ఆనందమే,
ఆహ్లాదమే,
నింగి లోని తార,
నేల మీద కోస్తే,
రంగు లేని రాయి
పగడాల హారం మైతే
ఆనందమే,
ఆహ్లాదమే,.........


కన్నులు రెండు,
తనువులు రెండు,
ప్రేమలు మెండు,
భాగ్యము పండు,
దారే తెలిసేనులే
ఇక మది మురిసేనులే :ఆనందమే:


తకదిమి
దమితక
తరికిట
కిటతరి
మోత మోగే.
మనసూగే........ :ఆనందమే:




కోనలోని ధార,
కురుసెనంట మీన,
అందమైన జాన
ఆడుతోందీ... కాన,
తీగల్లేని వీణ,
వాయించే లోలోన,
:ఆనందమే:


సిగ్గులేని ధార ,
నడుము తాకుతుంటే
మెలిక పెట్టినట్టు,
కలుక్కూమన్నదోయీ
మాయదారి
గుండెల్లో....

ఆనందమే
ఆహ్లాదమే......


జాజిపూల వాన కురిసి, దాగుడుమూతలు ,
నాతో ఆడి
అలసి ,సోలసి,
తనకై జడిసి
పురి
విప్పి నడిచే
ఆడ నెమలి......
ఆనందమే
ఆహ్లదమే.............

.............................(ఇంకా ఉంది )



..........................by.................. govind@..................





© All Rights Reserved