...

16 views

తల్లిదండ్రులు v/s పిల్లలు
part-2

కాబట్టి పిల్లలకి కూర్టూన్స్ టీవిలో, ఫోన్లో అలవాటుచేయకండి. 12-19సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లల మనసు ఒక చోట నిలకడ గా ఉండదు (కోతిలాగా ఒక చెట్టు మీద నుండి ఇంకొక చెట్టు మీదకి దూకుతూ ఉంటుంది ).కాబట్టి ఈ వయసు లో ఉన్న పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితుల్లా ఉండాలి, వాళ్ళు ప్రతిదీ మీతో చెప్పుకునేలా ఉండాలి. ఒకవేళ మనం వాళ్ళతో స్నేహితుల్లా లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు గా ప్రవర్తిస్తూ ఉంటారు. మనం మంచి చెప్పిన టీన్ ఏజ్ పిల్లలు వినరు, వాళ్ళకి నచ్చిందే చేస్తారు. అలా చెయ్యకుండా ఉండాలి అంటే తల్లిద్రండులు వాళ్ళకి ఒక మంచి స్నేహితుల్లా ఉండాలి. ఇప్పటి జెనరేషన్ పిల్లలు స్నేహితుల్లాకే ఎక్కువ ప్రేయారిటీ ఇస్తున్నారు, ఎందుకంటే తల్లిదండ్రులు సరిగ్గా వాళ్ళతో మాట్లాడకపోవడం వలన. ఇంట్లో తల్లిదండ్రుల దెగ్గర ప్రేమ దొరకన్నప్పుడు పిల్లలు బయట ప్రేమను వెతుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఈ టీన్ ఏజ్ దాటే వరుకు పిల్లలతో ప్రేమగా, స్నేహితుల్లా మాట్లాడాలి. మనం కూడా వాళ్లతో అన్ని షేర్ చేసుకోవాలి.... అప్పుడు వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు.
20ఇయర్స్ నుండి వాళ్ళకి అన్ని భాద్యతలు తెలుస్తాయి... మంచి నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో ప్రయోజకులు అవుతారు.

మనం మన తల్లిద్రండ్రుల్ని అలాగైతే చూసుకుంటామో మన పిల్లలు కూడా మనల్ని అలానే చూసుకుంటారు.

కనిపించే దైవాలను విడవకు.(అమ్మ నాన్న )🙏🙏

కనిపించని దైవాల కోసం వెతకకు.

తప్పటడుగు వేసే ముందు గుర్తుచేసుకో ....అడుగులు నేర్పింది నాన్న అని,

తప్పు మాట్లాడే ముందు గుర్తుచేసుకో... మాటలు నేర్పింది అమ్మ అని,

తల్లిదండ్రులని మోసం చేసే ముందు గుర్తుచేసుకో....రేపు నీవు ని పిల్లల చేత మోసపోతావని...❣️❣️


© Vinni🖤