...

6 views

మరో అవకాశం పార్ట్ -3
ఆ రోజు ఆ కారులో ఉన్నది ఎవరో కాదు సాక్షాత్తు తన ఆగర్భ శత్రువు..
నందిని... సాయం చేసేందుకు చెయ్యి
ఇవ్వబోతె నెట్టెసి, గబాలున బయటికి
వచ్చింది... తను.....

దీన్ని... అని మనసులో అనుకుంటూ
ఇంట్లో కెళ్ళాడు.. శివ...
నందిని అతన్ని చూస్తూ కోపంగా
విడిదింట్లో అడుగు పెట్టింది..

అక్కడ అంతా కోలాహలం గా ఉంది....
నందిని తన ఫ్రెండ్ తో కలిసి పెళ్ళి కూతురు రూమ్ కి వెళుతుంది.....
అక్కడ శివ కనిపించడంతో మొహం చిట్లించుకుంటుంది....

ఆమె రాకను తెలుసుకున్న వెంటనే శివ
అక్కడ నుంచి మెల్లగా జారుకుంటాడు,
ఎవరతను??
మ్యానెస్
లేకుండా వచ్చాడు అని విసుగ్గా అంటుంటే
పెళ్ళి కూతురు తను మా చిన్నన్నయ్య
శివ.... అనగానే నందినికి
కళ్ళు బైర్లు కమ్మాయి....

అక్కడ నుంచి నేరుగా బయటకు వెళ్ళి తన రూమ్ లోకి వెళ్ళింది. ..

ఆ తర్వాత తను అందరి తో పాటు భోజనం చేయడానికి వచ్చింది....
శివ తన ఫ్రెండ్స్ తో కలిసి అందరికీ
సర్వ్ చేస్తున్నాడు.... అది చూసి నందినికి తినబుద్ది కాలేదు...
అన్నయ్య పెళ్ళి,
అందరూ చూస్తూ ఉన్నారని
ఆగిపోయి అందరితో
పాటు తనూ కూర్చుంది..

రైస్ బాక్స్ తో అందరికీ వడ్డించి,
నందిని ని అవైడ్ చేశాడు.. శివ
అతని పద్దతి చూసి ఫ్రెండ్ తిడితె
మౌనంగా అక్కడ నుంచి మెల్లగా
వెళ్ళిపోతాడు శివ....
అందరూ కలిసి ఫోటో తీసుకుంటుంటే

శివ ని ఫోటో తీయమని పెళ్ళికూతరు
అడిగితే.. నందు వైపు చూసి
కళ్లు బాలేవని ..వెళ్ళి పోతాడు
పరిస్థితి మరింత దారుణంగా ఉందని
నందిని మౌనంగా ఉండి పోతుంది
................

అతిధుల ఆర్భాటాల మధ్య వైభవంగా
జరిగింది... సునీత-సూరజ్ ల
పెళ్ళి....
మరో రెండు రోజులు తర్వాత పెళ్లికి
వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతుంటే
నందిని శివ ను కలిసి,
స్వారీ చెబుతుంది.. ఇద్దరూ ఫ్రెండ్స్
అవుతారు..

కొన్ని నెలల పాటు ఇద్దరు కలిసి తిరగని చోటు లేదు..
శివకు నందిని మీద తారా స్థాయిలో
ప్రేమను పెంచుకున్నాడు
ఆ విషయం ఆమెకు తెలియదు
అతన్ని కాలక్షేపంగా భావించింది
ఈ విషయం శివ కు తెలీదు,

ఓ రోజు శివ తండ్రి నందినికి పెళ్ళి అని
చెబుతాడు...
తన
దగ్గర మాట్లాడడానికి
మాటలు లేవు
బాధ తప్ప....
తనని
కలిస్తే
ఆమె అన్న
మాటలు శూలాల్లా
గుచ్చుకుంన్నాయి..
తనకు...
***************************
***************************
***ప్రస్తుతం....... *********

..............(ఇంకా ఉంది )....
.............by............ govind@....




.








© All Rights Reserved