...

1 views

aaditya hrudayam
ఆదిత్య హృదయం: అర్ధములతో
______________________
ఆదిత్య హృదయాన్ని ప్రతీరోజు ఉదయాన్నే మూడుసార్లు చొప్పున పఠించేవారికి దైర్యం, జ్ఞానం లాంటి దైవగుణాలు పెరుగుతాయి! శత్రువులు కూడా మిత్రులు అవుతారు. కఠిన సమస్యలు తొలగిపోతాయి! చింతలు చికాకులు పోయి,దైవభక్తి పెరుగుతుంది! ఇతరుల మీద ద్వేషం, అసూయ, గిట్టనితనం, మాత్సర్యం లాంటి అవగుణాలు పోయి, మనస్సు ఎప్పుడూ ఈశ్వరుడిపై లగ్నం అవుతుంది.

అన్నిటికీ మించి సూర్యభగవానుడు ఆరోగ్యప్రదాత!

అసలు ఆదిత్యహృదయం వల్ల లాభాలు ఇంతా అంతా అని చెప్పడం కానిపని! ఆదిత్యహృదయం అంటేనే అక్షయపాత్ర!

శ్రీరాముల వారు ఈ ఆదిత్య హృదయం పఠించిన తర్వాతే రావణాసురుడిపై యుద్ధానికి వెళ్ళి విజయం సాధించారని శ్రీమద్రామాయణం చెబుతున్నది.

ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుని ప్రార్థిస్తే ఆయురారోగ్యాలు, తలపెట్టే కార్యక్రమాలలో విజయం సిద్ధిస్తుంది.

ఆదిత్య హృదయాన్ని శ్రద్ధగా పఠిస్తే అనారోగ్యం దూరం అవుతుంది, ముఖవర్చస్సు మెరుగవుతుంది.

ఆదిత్య హృదయం లోని శ్లోకాలు వాటి అర్ధములు…

1. తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం

అర్థము:
యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను.

2. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః

అర్థము:
యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను.

3. అగస్త్య ఉవాచ:
రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి

అర్థము :
ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు.

4. ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం

అర్థము :
ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది.

5. సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం

అర్థము :
ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును ఆధివ్యాధులను తొలగించి ఆయుష్షును వృద్ధిపరుచును. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యము.

6. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం

అర్థము :
అనంతమైన బంగారుకిరణములతో శోభిల్లుచు, జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సుగలవాడు, సమస్త భువనములన నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము.

7. సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః
ఏశ...