...

0 views

papalu vyadhulu
పాపములు - వ్యాదులు - పరిహారములు.
_____________________
ప్రస్తుత కాలం లో కొన్ని పాపాలు తెలిసో తెలియకో చేయడం జరుగుతుంది. ఆ పాపాలు మనల్ని రోగాల రూపం లో వెంటాడుతుంది. కొన్ని రకాల జబ్బులకి మనం ఎంత మందులు వాడినా అవి తగ్గవు . అటువంటప్పుడు జబ్బులకి ముందు మందులు వాడాలి . తగ్గకపోతే రెండో ప్రయత్నం గా దానాలు ఇవ్వాలి . మూడో ప్రయత్నం గా మంత్ర జపం చెయించాలి, నాలుగో ప్రయత్నం హొమం చేయాలి .

* గ్రహణ కాలం లో సంభోగం చేయడం మహా పాపం గా పరిగణించబడుతుంది . గురువులని ద్వేషించుట, బ్రాహ్మణులని హింసించుట , ( బ్రాహ్మణ శబ్దమును కు అర్ధం జన్మను బట్టి ఆ కులంలో పుట్టడం కాదు.). ఇవి చేయడం వలన క్షయ, కాన్సర్ వంటి భయంకర వ్యాధులు వస్తాయి .

రేమిడి -

విష్ణు సహస్ర నామ స్తోత్రం భక్తి శ్రద్ధలతో 1116 సార్లు చేయాలి . లేదా రుద్ర సూక్తం 1116 సార్లు చేయాలి . ఆ తరువాత హోమం చేసి వస్త్రాలు దానం చేయాలి .

బ్రాహ్మణుడు అంటే ఎవరు ?

* దేవత్పత్యుపనయనాది సంస్కారాలు అనబడే రెండు జన్మలు గలవాడు.

* బ్రహ్మ వర్చస్సు చేత ప్రకాశించే వాడు.

* బడబాగ్ని వలె తృప్తి లేనివాడు.

* తనని తాను పాపం నుండి రక్షించు కొనుచు ఇతరులుని కుడా రక్షించు వాడు.

* పరబ్రహ్మ యందు నిష్ఠ కలవాడు.

* బ్రహ్మ జ్ఞానం గలవాడు.

జన్మ వలన అందరు శుద్రులే, " కర్మ " వలన ద్విజుడు అవుతున్నాడు. వేదం నేర్వడం వలన విప్రుడు అనిపించు కుంటున్నాడు. బ్రహ్మ జ్ఞానం పొందిన...