...

9 views

దాయలేని ప్రేమలు -4
శృతి.. ప్రియుడు కనిపించాడు...
ఆ క్షణం లో తన కళ్ళు..
ముత్యాలైనాయి...
హృదయం పగడమై ప్రకాశించింది..

ఆమె అమితానందం..
ఎవరూ ఊహించనిది..
శృతి జీవితం లో మర్చిపోలేని
రోజు అవుతుందని తాను గమనించలేదు....
తన లో,
తనకే,
గిలిగింత,
ఎక్కడో
తెలీని
పులకింత,
శృతి
శృతి మించి పోయేలా,
తన కే,
ఇంతటి గొప్ప
అదృష్టం కలిసి వస్తుందని ఊహించని
లేదు...
శృతి తో..
"తిన్నావా"
"ఎలా ఉన్నావు"
అనే పలుకులు ఆమెకు
వరాలు కురిపించాయి..
ఆమె మాట్లాడుతూ
కన్నీళ్ళు పెట్టుకుంది...
కారణం
ఇద్దరికీ తెలిసిందే
తాను
కృష్ణ లా
పొంగుతుంటే,
తను మాత్రం,
సాగరంలా,
సాదాగా
వెళ్లి పోయాడు...
ఆమె ఆశలు..
ఎండమావి లా
ఎండిపోయి..
నీరుగారి
పోయింది...

శృతి కి తెలీదు..
అదే అతని తో
చివరి చూపు అని..
అతను ఎగ్జామ్స్ రాసి
ఇంటికి వెళ్లి పోయాడు..
మన అమ్మాయి..
శృతి గురించి
చెప్పక్కర్లేదను
కుంటా...
(ఇంకా ఉంది)



© గోవింద్ @...