...

3 views

నాన్నకు ప్రేమతో
నాన్న నా కోసం నా చిరునవ్వు కోసం తహతహలాడేవారు

ఇప్పుడు ఎవరైనా తండ్రీ తన బిడ్డ ను ఎత్తుకుని కనిపిస్తే

నా చిన్ననాటి రోజులు నాన్న చెయ్యి పట్టుకుని నడిచిన రోజులు గుర్తున్నాయి

ఆటలు ఆడీ అలసిపోయి, ఆకలితో, దాహంతో ఎడుస్తున్న నన్ను చూసి

నాన్న  భుజాల మీద కూర్చొని చాలా దూరం వెళ్ళటం ..

ఇవ్వన్నీ గుర్తుకు వస్తాయి, నాన్న ప్రేమగా ఎరా నాన్న నా బంగారు అనే పిలుపు

నిజం చెప్పాలంటే నేను ఇవ్వన్నీ గుర్తు చేసుకోవటం లేదు ..

కేవలం నాన్నను చాలా మిస్ అవుతున్నాను అందుకే గుర్తుకు వస్తున్నాయి

జీవిత పోరాటం ఆయన నుంచి నేర్చుకున్న
ఒక్క రూపాయి మాకు చాలా నేర్పింది
ఆకలిగా లేదా దాహం వేసేది  కానీ మా కోసం అయన

వాటిని లెక్క చేయలేదు మాకు ఏమి తినిపించాలి అని

ఆయన ఆరాటపడే వారు నేను ఏది పట్టుబట్టిన ఆధి నాకు తెచ్చేవారు

జేబు ఖాళీగా ఉంది కానీ మాకోసం శ్రమించి ఇచ్చేవారు .

మనం ఎన్ని తప్పులు చేసిన నవ్వుతూ విసుగు చెందకుండా

ఆధి తప్పు నాన్న అలా చేయకూడదు అని సున్నితంగా వివరిస్తారు

ఎందుకు అయన అంత సహనం ఓర్పు లేదు అని అనిపిస్తోంది

అందుకే నిజం చెప్పాలంటే నేను నాన్నను చాలా మిస్ అవుతున్నాను

అయన భుజం మీద ఉన్నప్పడు అతని చెయ్యి నొప్పి

పుడుతుందా అని ఎప్పుడు తోచలేదు..

అతని  నెరవేరని కలలను కూడా మరచి నా కోసం శ్రమించాడు ..

తండ్రి పోయారు , కన్నీళ్లు మాత్రమే మిగిలాయి
నాన్న చెప్పే మాటలు అయని నవ్వు అయన కేర్ మిస్ అవుతున్నాను.

నిజం చెప్పాలంటే నేను నాన్నను చాలా మిస్ అవుతున్నాను

విడిచిపెట్టిన తల్లి డిమాండ్ కనిపించదు..

తల్లి మణికట్టుపై ఇప్పుడు కంకణం కనిపించదు..

ఆధి నాన్న లేని లోటు నీ చూపిస్తుంది

అమ్మ ముఖం చూసినప్పుడల్లా..

ఆధి నాన్న లేని లోటు నీ చూపిస్తుంది

అమ్మ నాన్నతో మార్కెట్ కి వెళ్లి సరుకులు తెమ్మని చెప్పి పంపేది

ఇప్పుడు అమ్మే రోజు మార్కెట్ చేసి వస్తుంటే ఆధి చూసి

నాన్న లేని లోటు తెలియ చేస్తుంది .

బాబు అడుకోటని  తినడానికి ఇవి తెచ్చాను అని అనే మాటలు జ్ఞాపకం వస్తుంది

నిజం చెప్పాలంటే నేను నాన్నను చాలా మిస్ అవుతున్నాను

జీవితంలో చాలా మందిని కోల్పోతాం ఆధి కొన్ని రోజులు

జ్ఞాపకాలలో వుండి చెరిగి పోతాయి ......
కానీ నాన్న మన జీవితం లో నుండి వెళ్లిపోతే మన
చివరి శ్వాస వరకు అయన నా కోసం ఇది చేశారు ఆధి చేశారు .

పక్క వాని తండ్రిని చూసిన నాన్న వుంటే ఇంత కన్నా
గొప్పగా చూసేవారు అని చిన్న గర్వం కూడా తొంగి చూస్తుంది.

అంతెందుకు నాన్న వెళ్ళిపోయాక నేను కష్టపడటం
మొదలు పెట్టాను. ఇప్పుడు నాలోనే నాకు నాన్న కనిపిస్తున్నారు ..

ఇప్పుడు నా కష్టం లో కూడా మా నాన్న ఇంత కంటే
ఎక్కువే కష్ట పడ్డారు అని అనిపిస్తుంది...

నేను అయన లా గొప్ప తండ్రిని కాగలన..?

నిజం చెప్పాలంటే నేను చాలా మిస్ అవుతున్నా నాన్నని ..




   😭 👨‍👦 మిస్సింగ్ యు సో మచ్ డాడ్ 👨‍👦 😭


© All Rights Reserved
© పాఠకాల@వినయ్ కుమార్.నరుతో