...

18 views

మనసులో రాసుకున్న కథ..!
జీవితంలో ఏది,ఎప్పుడు,ఎక్కడ,ఎలా జరగాలో ముందుగానే ఆ సృష్టికర్త మన తలరాతల్లో రాసి ఉంటాడు..మన జీవన ప్రయాణంలో ఎవరిని ఎందుకు కలుస్తామో,ఎవరు మనతో జీవితాంతం నడుస్తారో మనకు తెలియదు.. అలా అందమైన ఆశ్చర్యంగా మిగిలిన ఈ, నా మనసులో రాసుకున్న కథ…
జీవితం చాలా గొప్పది,అద్భుతాలను పరిచయం చేస్తుంది. నేటి ఆధునిక ప్రపంచంలో సామాజిక మాధ్యమాల వల్ల పదులల్లో కాదుకదా ,వేలల్లో స్నేహితులు పరిచయమవుతుంటారు..అలానే పరిచయం అయిన వ్యక్తి తను.ఒక అబ్బాయి ఎప్పుడు చూడని అమ్మాయిని పరిచయం చేసుకోవాలి అని అనుకుంటున్నాడు అంటే కేవలం స్నేహం మాత్రమే ఉంటుందా?ఏమో, ఉండచ్చు ,ఉండకపోవచ్చు...మాములు వ్యక్తిగా పరిచయం అయినా మనసులో నిలిచిపోయారు.తన పరిచయం నన్ను నాలో లేకుండా చేసింది. గొడవలతో మొదలైన పరిచయం గాఢమైన ప్రేమగా ఎప్పడు మారిందో తెలియదు.అలా మొదలైంది…ఈ మా పరిచయం.మాటల్లో మాధుర్యాన్ని అర్థముచేసుకునే శక్తి భగవంతుడు ఇవ్వడం మంచిదనిపించింది.. తనకు నాపై ఉన్న ఇష్టం మాటల్లో తెలిసిపోయింది.నాకు తనంటే ఇష్టంపెరిగింది.ఓ క్షణం మొదలైన ఇష్టం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టదేమో మరి. ఒకరికి ఒకరంటే ఇష్టం ఉన్నా ఎన్నడూ చెప్పుకోలేదు . స్నేహితుల మాటల ప్రవాహం లో ప్రేమకూడా తోడైంది.కాలంతో జీవితాలు మారిపోతాయి అంటే ఎన్నడూ పట్టించుకోలేదు ,కానీ ,ఆ క్షణం అర్థమయింది. నా చదువు పూర్తికారగా,ఎదిగిన పిల్లలకు పెళ్లి అనేది ఒక బాధ్యతగా పెద్దలు తీసుకుంటే,ప్రేమ అడ్డు పడుతుంది.ప్రాణం,ఆత్మ మనల్ని వదిలినప్పుడే కాదు మన ప్రేమ,ప్రేమించిన వాళ్ళు దూరమైనా మన ప్రాణం పోయినట్టే అనిపిస్తుంది…తనకు తెలియదు నా మనసులో ఎం జరిగుతున్నదో,కానీ ఎక్కడో తనని కోల్పోతానేమో అనే భయం మొదలైంది.జీవితం చేజారిపోతుంది అని అనిపిస్తుంది.ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది అని తెలిసినా ,ఎక్కడో ఒక చిన్న అనుమానన్నీ జరిగిన సన్నివేశాలు పెంచాయి.కాలం మారిపోయింది.ప్రతిక్షణం తన తలపులలో జీవితం గడవసాగింది.భగవంతుడు అద్భుతాలు చేస్తే బాగుండు అని అనుక్షణం అనిపిస్తుంది. తాను నాతో జీవితాంతం కలిసుంటే బాగుండు అనిపిస్తుంది.కానీ తాను ఒకటి తలిస్తే ,దైవం మరొకటి తప్పక తలుస్తుంది అన్నట్టు నాకు పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి.తనతో మాట్లాడే అవకాశం పోయింది. పెద్దలకు చెప్పే స్వతంత్రం లేదు…ఏమి చేయలేని పరిస్థితి.తలవంచక తప్పలేదు.తండ్రి పెంపకంలో ఆయన మాటని కాదు అనలేకపోయాను.వచ్చే పెళ్ళికొడుకు ఎవరో తెలియకపోయిన పెళ్లిచూపులకు ఒప్పుకున్నాను.ఆ క్షణం దించిన తల వారు వచ్చినా కూడా ఎత్తలేదు. ఆ తరుణం వచ్చింది.పెళ్ళివారు వచ్చారు. ఇష్టంలేకపోయినా వెళ్లి ఎదురుగా కూర్చున్నా.తలెత్తి చూడమన్నారు కానీ ఆ గంగమ్మ నా కళ్ళలో తాండవం చేస్తుంది. వచ్చిన వాడితో విడిగా మాట్లాడాలి అని సెలవిచ్చారు,సరేనన్నాను. తనతో కలిసి వెళ్ళాను.అప్పటికి నేను తనని చూడలేదు.ఒకచోట కూర్చున్న నాతో మాట్లాడే ప్రయత్నం చేసాడు,ఆ గొంతు ఎక్కడో విన్నట్టు గుర్తు,మనసుకు ఆనందం కలుగుతుంది, వచ్చింది ఎవరో తెలియదు.తలెత్తి చూడాలి అనిపించినా, మనసులో ఎదో గందరగోళం. నా పేరు పిలిచిన క్షణం,నా ప్రయత్నం లేకుండానే నా కళ్ళు తనకోసం వెతికాయి.వచ్చింది ఎవరో కాదు తానే.అప్పటిదాకా ఉన్న కన్నీళ్లు ఆనంద భాష్పాలుగా మారిపోయాయి.తనని గట్టిగా హత్తుకున్న క్షణం ,నేను ఈ ప్రపంచాన్ని మరిచిపోయాను.నా పెళ్లిచూపులు, నా ప్రేమను వ్యక్తపరిచే క్షణమైంది.నా మనసులో రాసుకున్న కథ ఆ క్షణం తన మనసులో రాసిన కథగా అర్థమైంది💓💓💓.
© prathyusha.kaipa(gnanvi)