...

1 views

తొలిచూపు...✍️
అది శిశిరం... వరండా ఎదురుగా విరగపూసిన తెల్లని చామంతులు... ఆకుపచ్చని ఆకులను తడుపుతున్న మంచు చినుకులు... బద్దకంగా బైటికొస్తున్న సూరీడు.. లయబద్దంగా మోగుతున్న అలారముతో పోటీపడుతున్న చక్కని స్వరం... అపుడే తెల్లారిందా అంటూ అందమైన కనుల తలుపులను తెరిచిన నేను.. సమయం ఏడు గంటలు చూపెడ్తున్న గోడ గడియారం.. గబగబా లేచి కిటికీ కీ ఉన్న గులాభీల డిజైన్ పరుచుకున్న తెల్లని కర్టెన్ జరిపాను ఆత్రంగా.. ఏమో ఎపుడూ లేనిది కోకిల కూసిందా అన్నట్టుగా పిలిచిన ఆ గొంతు ఎవరిదంటూ మనసు అరాతీస్తుంది లోలోపలే...
ఎందుకంటే పక్క ఇంట్లో కొత్తగా దిగిన వ్యక్తి ఇంకా పరిచయం అవలేదుగా... అతనే తన భవిష్యత్తు అని ఆ నిమిషం తెలియదుగా....
అమ్మా అంటూ కేకలా అరుస్తూ వెళ్లిన నాకు... అమ్ము వేడినీళ్లు రెడీ అంటూ అమ్మ పిలుపు... నాన్న గారు పైనకే పేపర్ చదువుతూ నాకు మళ్ళీ పేపర్ చదివే పని తప్పిస్తున్నాడు. ఇదంతా రోజు జరిగే తంతే.. కానీ మనసు ఆనందం తెరేదో కప్పుకుంది తొలిసారిగా... తనకీ నచ్చిన పాట నీ హమ్ చేస్తూ తనకీ పట్టుపడిన స్వరం ఎవరిదో శోధించే పనిలో పడింది తన చూపు...
అమ్మా...పక్క ఇంట్లో ఎవరు దిగారు అంటూ అడుగుతున్న నాకు... వాకిట్లో వంకల ముగ్గేస్తూ కనపడింది పసుపు రంగు పరికిణీ మీద వంకాయ రంగు ఓణీ తో.. పొడుగు జడ వేసుకున్న పూజ. ఎపుడూ నైట్ ప్యాంటు లతో తిరిగే నాకు కొత్తగా కనిపించింది ఆ పిల్ల. అమ్మ కూడా ఆ పిల్ల నీ చూపెడుతూ నాన్న తో అంటుంది... చూసారా మీ కూతురు కూడా అలా ముగ్గులు వేస్తే చూడాలి అనుకున్నా. కానీ ఇదేమో ఆ కంప్యూటర్ అంటూ అర్థరాత్రి దాకా పనిచేస్తూ... ఆ ఇంగ్లీష్ భాష తో మనల్ని సంప్రదాయాలకు దూరం చేస్తుంది. నాన్న నన్నే చూస్తూ నా కూతురు అంటే ఏమనుకున్నవు మరి... నీలా ముగ్గులు.. కుట్లు అంటూ కుచోమంటావా ఏంటి...? ఇంతలో కాపీ కప్ తో వచ్చిన అమ్మ.. జాను ఇదిగో అంటూ చేతిలో పెట్టింది. థాంక్స్ అమ్మా అంటూ తీసుకొని అలా వరండా బైటికి వెళ్లిన నాకు మందార కొమ్మలని సరి చేస్తూ ధనుష్ కన్పించాడు.. అపుడే అర్థమైంది ఆ గొంతు కి సంబంధించిన శరీరం ఇదనీ.. తొలిచూపులోనే నా గుండెలో తిష్ట వేసిన ఆ రూపం...పచ్చబొట్టు లా మారిపోయింది. పక్క పక్క ఇల్లు కావడం వల్ల కొద్దిరోజుల్లోనే పూజ కి నాకు మంచి స్నేహం కుదిరింది. అలా పూజ తన అన్న నీ పరిచయం చేయడం.. తను ఒక మంచి కంపెనీ లో సాప్ట్వేరు ఉద్యోగి అవడం.. నెమ్మదిగా మొబైల్ చాటింగ్ నుంచి ధనుష్ కాస్త ధను అని పిలవడం చకచకా జరిగిపోతున్నాయి. క్యాలెండర్ లో పేజీ లు తిరుగుతున్నాయి.. ఆ రోజు నా పుట్టినరోజు.. అందరిలా తను విషెస్ పంపాడు, కానీ చాలా స్పెషల్ గా... నీ ప్రేమ నాకు కావాలి అంటూ... ఒక గులాబీలా గుత్తి తెచ్చి.. నా ఎదుట నిల్చున్న తీరు... నాకోసం ఆలోచించే తీరు.. చాలా బాగుంటది. నిజమే తొలిచూపు ఎపెక్ట్ ఇంతలా ఉందని తెలియదు గానీ... ధను మా ఇంట్లో మనిషి అయిపోయాడు... నాన్న కి బాగా నచ్చాడు... నేను నచ్చిన కూర అంటి తో చేయించుకుని మరీ తింటున్న. పూజ నేను... అప్పుడపుడు ధను గుడికి వెళ్ళడం... చీర కట్టులో నన్ను చూసి అమ్మ దిష్టి తీయడం... నా డైరీలో అన్ని అందమైన పేజిలే ధను వచ్చాక.. నాకు నచ్చడం తో పాటు అమ్మకీ.. నాన్న కీ దగ్గరయిన ధను త్వరలోనే నా మెడలో మూడు ముళ్ళు వేసి... ఏడు అడుగులు వేయడం అదృష్టం. అల్లరి చేసే నేస్తమే... ఆడపడుచు అయి ఆట పట్టిస్తుంటే ఆ మురిపమే వేరు. పక్కింటి అబ్బాయి కాస్త పక్కనే చేరి పెళ్లి ఫోటో లో చేరిపోయాడు. నా గుండెకు నచ్చిన వ్యక్తి నాకు దక్కాడు.
ఇపుడు పాట ని పక్కింట్లో నుంచి వినే పని లేదు... పక్కనే కూర్చుని పాప్ కార్న్ తింటూ వింటున్నా మరీ..💜❤️
@@@@@@సమాప్తం @@@@@@@@