...

0 views

తొలి అడుగు
తొలి అడుగు

రెండు కాళ్ళు నడచు దారి ఒకటైననూ
అడుగులన్నవి ముందు వెనుక పడును
అటులె మన పనులన్ని నెరవేరు అటు ఇటుగ
కార్య సాధక ముందుకు సాగుమిపుడే

అడుగు ... మన జీవన పదాన్ని నిర్దేశించే అతి ముఖ్యమైన అంశాల్లో అత్యంత ప్రధానమైనదీ కీలకమైనది... నిజానికి మన చిన్న తనంలో మనం నేర్చుకునే అత్యంత క్లిష్టమైన విద్యల్లో ఒకటి అడుగులు సరిగా వేయడం .... అటువంటి పసిప్రాయంలో వడి వడిగా నడవాలన్న తాపత్రయంలో మనం పడే ఆపసోపాలు చూడడం పెద్దలకు ఒక ముచ్చట వేడుక సంబరం.. వీటినే 'తప్పటడుగులు' అని అంటారు
" బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు" అని యమలీల అనే చిత్రంలోవచ్చిన పాట ఎంత గొప్ప సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే.... కానీ ఈ తప్పటడుగుల వలన వచ్చే ప్రమాదం ఏమీ లేదు .. వినోదం తప్ప ....

కానీ మనం జీవితాంతం వేసే అడుగులు కొన్నుంటాయి .. అవే మనం తీసుకునే నిర్ణయాలు... ఇవే మనల్ని అందాలన్నీ ఎక్కిస్తాయి అలాగే కాస్తో కూస్తో తేడా వస్తే.. అధః పాతాళానికి పడేస్తాయి... చరిత్రలో నిలిచిపోయేలా చరిత్ర సృష్టించిన ఎందరో ఈ నిర్ణయాల విషయంలో...