...

19 views

అంతరించిన బంధం
"ఎంత ముద్దుగా ఉన్నాడో చూడు నా కొడుకు,అచ్చు నా లాగా " అంటూ తులసి మురిసి పోతుంది మొదటి సంతానాన్ని చూస్తూ...తన భర్త అయిన శంకర్ తో చెప్తూ...

శంకర్,తులసి లకు ఒక సంవత్సరం క్రితం పెళ్లి అయ్యింది,ఉద్యోగ రీత్యా ఇద్దరు బద్వేల్ లో కాపురం పెట్టారు.చాలా అన్యోన్యంగా సాగుతూ ఉన్న కాపురం లోకి మొదటిగా మగ పిల్లాడు పుట్టడం ఇద్దరికీ చాలా ఆనందంగా ఉంది.

ఒక వారం తరువాత ,తులసికి పురుడు చేసి అబ్బాయికి నామకరణం చేశారు శివ అని.దంపతులు ఇద్దరూ కూడా చాలా మురిపెంగా ,ఎంతో ప్రేమ తో చూసుకునే వారు.మొదటి కొడుకు కావడం తో గారభాం కూడా బాగానే చేశారు.....ఇలా సాగుతున్న జీవితం లో మూడు సంవత్సరాలు కే తులసికి ఇద్దరు కొడుకు లు పుట్టారు...శంకర్ గారు ఉద్యోగం కనుక ఇంటి దగ్గర ఉండటానికి కుదరదు,తులసి ఒక్కతే పిల్లలని చూసుకోడానికి ఇబ్బంది పడటం తో పెద్ద కొడుకు అయిన శివ ని చదువు పరంగా హాస్టల్ లో వేశారు.

శివ చిన్న పిల్లాడు కదా...అమ్మని వదిలి వుండలేక ఇంటికి వచ్చేస్తా అని మారాం చేసే వాడు.కానీ తులసి,శంకర్ ఇద్దరు పెద్దొడిని బాగా చదివించాలి ,గొప్ప వాడిగా తీర్చి దిద్దాలి అనే ఉద్దేశ్యంతో హాస్టల్ హాస్టల్ అంటూ అమ్మ ప్రేమ కి,నాన్న అనురాగానికి దూరం చేశారు...

ఇలా శివ చదువు పదవ తరగతి వరకు కూడా హాస్టల్లో నే సాగింది.తరువాత కూడా శివని వేరే ఊర్లో నే చదివించారు శంకర్ గారు.ఇలా డిగ్రీ పూర్తి చేశాడు శివ,ఇక తరువాత చదువు నేను వేరే ఊర్లో చదువుకుంటా అని శివని చెప్పేశాడు శంకర్ కి.కొడుకు మాటను కాదు అనకుండా ఎం.బి. ఏ చదివించాడు శివని.శివ ఏం అడిగిన కూడా లేదు అనకుండా ఇచ్చేవారు తల్లి తండ్రి...