...

20 views

అమ్మా(యి) నీకు జోహార్లు🙏
ప్రాణం విలువ మొదటగా తెలిసేది ఎవరికి అంటే అది అమ్మే అని చెప్పవచ్చు...ఎందుకంటే తన ప్రాణం పోయిన పర్వాలేదు అనుకుని మరొకప్రాణిని బ్రతికించడానికి ప్రయత్నిస్తుంది...
ఒక తల్లి రుణం మళ్ళీ తనను బిడ్డగా కని పెంచితేనె తీరుతుందేమో...
🙏🙏🙏🙏🙏🙏ఒక అమ్మ జీవితం🙏🙏🙏🙏🙏🙏
ఒక బిడ్డై,అక్కయ్యయై,చెల్లియై,గురువునకు విద్యార్థినియై,స్నేహితురాళ్ళకు సఖియై,భర్తకు భార్యయై,అత్తమామలకు కోడలుయై,మరదళ్లకు, మరుదులకు వదినయై,వదినలకు,బావగార్లకు మరదలుయై,బిడ్డలకు తల్లియై.ఆహ్!...ఇన్ని బంధాలను ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ,వారి ఆహారవ్యవహారాలు,ఆరోగ్యక్షేమాలు చూసుకుంటూ...ఇన్ని చేసి తాను ఏమి ఆశించక భగవత్స్మరణలో కూడా నా బిడ్డలను,నా భర్తను,నా కుటుంనాన్ని చల్లగా చూడు అని వేడుకుంటు, తన గురించి క్షణమైనా ఆలోచించని మహాసాత్వి అమ్మ...
అమ్మ నీకు జోహార్లు🙏

#అమ్మ @prathyu