...

7 views

రతనాల సీమ పార్ట్ -3
ఆ కంచు కోట లాంటి ఇంట్లో
తోడుగా పెద్ద చెళ్ళి,
ప్రాణం పెట్టే అత్తా, మామలు,
ఇలా హాయిగా.. మూడేళ్లు
గడిచాయి....
చెళ్ళి నీళ్ళోసుంకుంది....
మరిది ఓబుల్ రెడ్డి...
తండ్రయ్యాడు
.......... ..పసికందు ఏడుపు తో
భూపతి రెడ్డి ఇంట్లో స్వర్గం
కూర్చుంది.....

ఓ నాటి వర్షం కురిసే రాత్రి....
పెద్ది రెడ్డి....
పెండ్లా‌మ్ కాటికి వచ్చిండు
అతని చొక్కాకున్న రక్తపు మరకలు చూసి శివ రంజని
భయపడింది

అతను రాక్షసంగా నవ్వుతూ
పగోడు చేనుకాడ కాపు కాసిండు
నరికొచ్చినా......అంటూ మీసాలు తిప్పుతూ బట్టలు మార్చుకుని
నీలిరంగు గళ్ళ లుంగీ కట్టుకుని..
తెల్లని బానీను వేసుకుని వచ్చాడు ....


మా తాత భూపతి రెడ్డి ని మాముందనే పగోళ్ళు నరికినారు
అప్పుడు నేను ఇంకా పిలవ్వోంన్నే
కాపు కాసి దొరికినోళ్ళని దొరికినట్టు
ఏసేసినా....

తాత సెప్యా...
ఇట్టముంటేనే తినమని,యాడన్నా
పండమని....
నీ ప్యామతో నువ్వు కోరుకుంటేనే
ఏంధ్యనా... ఈడా వద్దంటే వద్దు...
రమ్మని లాగనీకి కసాయోన్నీ కాదు
అమ్మి నాను...
అంటూ దుప్పటి. దిండు తీసుకుని
ఆమె మంచం కింద పడుకొంటాడు
పెద్ది రెడ్డి.....
.......

అతని అందమైన ముఖం,
దిట్టమైన వ్యాయామం చేయడం వల్ల
లావెక్కిన పొడవాటి చేతులు,
విశాలమైన వక్షస్థలం చూస్తూ.....
శివ రంజని..
మంచం మీద పడుకుని నిద్ర లోకి
జారుకుంటుంది...........
(ఇంకా ఉంది)

.................by....... govind@....





© All Rights Reserved