...

1 views

కలికితు 'రా'యి
RAW
Episode-1
Voice : అది భారత గూఢచర్య వ్యవస్థలో అతి ముఖ్యమైన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్- RAW సభ్యులు సమావేశం అయిన ఒక గొప్ప వేదిక. ఆధునిక సొగసులతో కూడిన రంగు రంగుల విద్యుద్దీప కాంతులతో ప్రాంగణం అంతా ధగ ధగ మెరిసిపోతోంది.
సభకు హాజరైన విశిష్ట అతిధులు అందరు జంటలు జంటలుగా, గుంపులు గుంపులుగా నిలబడి ఎవరికి నచ్చిన డ్రింకులు వారు సిప్ చేస్తూ గాసిపింగ్ లో మునిగి తేలుతున్నారు.
ఇంతలో ప్రవల్లిక పరమేశ్వరన్ మైక్ లో..
ప్రవల్లిక : " లేడీస్ అండ్ జెంటిల్మెన్..KINDLY pay attention. this program about begin in few seconds."
వాయిస్: అని వినయంగా పలకరించి అందరినీ స్పృహ లోకి తెచ్చిన ప్రవల్లిక గొంతు ఆ సభా ప్రాంగణం అంతా ప్రతిధ్వనిం చింది. కొద్ది సేపటికే ..అక్కడి కోలాహలం అంతా సద్దుమణిగి ..నిశ్శబ్దం ఆవరించింది. ప్రవల్లిక కంటిన్యూ చేస్తూ
ప్రవల్లిక : Hello all officers…A very warm welcome to all of you to this wonderful program.
Let me first introduce myself. This is Pravallika Parameswaran, Your host for today’s event. I feel blessed and proud to become a part of this programme.
వాయిస్: అంటూ ఆరోజు జరగబోతున్న ఈవెంట్ గురించి చెపుతూ ఉంది యాంకర్ ప్రవల్లిక ఆమె ఆరడుగుల ఆజానుబాహురాలు. చామన ఛాయ మేనిరంగుతో, అందమైన ముంగురులతో, ముసిముసి నవ్వులు చిందిస్తూ మెరిసిపోతోందా చక్కని చుక్క.

ప్రవల్లిక : "హననుమంతుని ముందు కుప్పిగంతులంటారు" ప్రస్తుతం నా పరిస్థితి అలాగే ఉంది. రా..గా పిలవబడే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మీరంతా ఈ శాఖా కుటుంబం లో సభ్యులే.
అనేక దశాబ్దాలుగా వివిధ దేశాలలో పలు మారు పేర్లతో అజ్ఞాత జీవితాన్ని గడుపుతూ ..దేశం గర్వించదగ్గ ఎన్నో సాహసాలు చేసారు మీరంతా
పబ్లిసిటీకి దూరంగా ఉండే పబ్లిక్ ఫిగర్స్ మీరు. మీ జీవితం అనూహ్యం. మీ త్యాగం వర్ణనాతీతం. శత్రువుకు తెలియకుండా శత్రువు ఇంట్లోనే ఉంటూ వారి,..గుట్టుమట్లను, కీలక రహస్యాలను ప్రభుత్వాలకు చేరవేయడంలో మీరు చూపించే తెగువ, చాతుర్యం అనితర సాధ్యం. మిమ్మల్ని, మీ సేవలను దేశం ఎంత ప్రశంసించినా తక్కువే. Now coming to the point . .. ఇన్నాళ్లు మీతో కలిసి ..దేశానికి ఎనలేని సేవలందించిన ..మిస్టర్ ధనుంజయ్ ..ఈ రోజు రిటైరై విశ్రాంతి జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇన్నేళ్ల వృత్తి జీవితంలో వారికి ఎదురైన అనుభవాలను ఆయన మాటల్లోనే విందాం"
వాయిస్ : అనగానే సభికుల కరతాళ ధ్వనుల మధ్య ..వేదికనెక్కాడు ధనుంజయ్. గంభీరమైన అతని రూపం, ముఖంలోని వర్చస్సు అక్కడున్న అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఆయన వస్తూనే అందరికి వినయంగా నమస్కరించాడు. చూడ్డానికి సింపుల్ గా ఉన్నా అతను వేసుకున్న కోటు, సూటు అతనికి ఒక రాయల్ లుక్ ని ఇచ్చాయి. వస్తూనే మైక్ ముందు నిలుచున్నాడు. ఈ లోగా ..అతని సీనియర్ ఆఫీసర్ అతని అసిస్టెంట్ తో కలిసి వేదికపైకి వచ్చారు. వస్తూనే ధనుంజయ్ ను ప్రేమ పూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. వెంటనే తన చేతిలోని శాలువాను ధనుంజయ్ భుజాలపై కప్పాడు. ఆ తరవాత తన వెంట వచ్చిన అసిస్టెంట్ తెచ్చిన పుష్పగుచ్చాన్ని అందుకొని ..ధనుంజయ్ చేతికి అందించాడు.
మరోమారు అతని రిటైర్మెంట్ లైఫ్ ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ మెచ్చుకోలుగా భుజం తట్టి వేదిక దిగాడు ఆ ఆఫీసర్. అనుకోకుండా తనకు జరిగిన ఆ ఆత్మీయ సత్కారానికి భావోద్వేగానికి లోనయ్యాడు ధనుంజయ్. అతని కళ్ళు చెమర్చి, గొంతు మూగబోయింది.
వెంటనే కళ్ళజోడు చేతిలోకి తీసుకొని, కళ్ళు తుడుచుకుని.. గొంతు సవరించుకుని ..మాట్లాడడం మొదలుపెట్టాడు ధనుంజయ్.
ధనుంజయ్ : "డియర్ ఫ్రెండ్స్ అండ్ కొల్లీగ్స్ ...టుడే ఈజ్ ది మోస్ట్ మెమొరబుల్ డే ఇన్ మై లైఫ్. రిటైర్మెంట్ ఏ ఉద్యోగికైనా కామన్. కానీ ఇలాటి రోజు నాకు వస్తుందని నేను ఏ రోజూ అనుకోలేదు. బట్ ఐ యాక్సెప్ట్ దిస్ బిట్టర్ ట్రూ త్... ఇన్నేళ్ల రా సర్వీసులో రాయిలా రాటుదేలిన నాలోనూ కన్నీళ్ళున్నాయని ఇన్నాళ్లకు నాకు గుర్తొచ్చింది.
ఇలాంటి సందర్భంలో నేను ఏం చెప్పగలను? నిజానికి నేను 'రా' లో చేరడానికి కారణం మా నాన్నగారు స్వర్గీయ పరాంకుశం గారు. వారు ఈ సంస్థ ప్రారంభమైనప్పటి నుంచీ సేవలందించారు. నాటి నుంచి నేటి వరకు మన సంస్థ సాధించిన సాహసోపేతమైన విజయాలను మీ కళ్లముందుంచాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మన వ్యవస్థ శాశ్వతంగా ఉండాలి. మీ అందరికి తెలిసే ఉంటుంది. మన సంస్థ 1968 ..సెప్టెంబర్.. 21 వ తారీఖున ప్రారంభమైంది. ఈ సంస్థ స్థాపనకు నేపథ్యం 1962 లో జరిగిన 'చైనా-భారత్ యుద్ధం.
వాయిస్: అంటూ భావోద్వేగం తో RAW సాధించిన విజయాలు ఒక్కొక్కటీ కళ్ళకి కట్టినట్టు చెపుతున్నారు ధనుంజయ్.

- To be continued