...

0 views

ప్రేమ ప్రయాణం ( ఎపిసోడ్ - 4 )
(సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి పడుతుంది. దీపికా దీర్ఘంగా ఆలోచిస్తుంది. తనకు నిజం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది. అంతలో రాజేష్...)

రాజేష్: దీపికా ! ఏంటి అంతలా ఆలోచిస్తున్నావ్ . బోర్ కొడుతోందా?

దీపికా: అలా ఏంలేదు. రేపు ఎగ్జామ్ ఉంది కదా దాని గురించి ఆలోచిస్తున్న .

రాజేష్: దాని గురించి ఆలోచించి మీరేం టెన్షన్ పడకండి.
(అలా వాళ్ళు మాట్లాడుతుండగా స్టేషన్ వచ్చింది. సమస్య ఏంటంటే టైన్ ట్రాక్ విరగడం వల్ల వాళ్ళు ప్రయాణిస్తున్న ట్రెన్ దాదాపు గంట సమయం నిలిపివేయబడుతుంది . ఈ విషయం తెలిసి రాజేష్ దీపికా ని కాఫీ తాగడానికి పిలుస్తాడు. తాను నిరాకరిస్తుంది. రాజేష్ బలవంతాన వెళ్ళక తప్పలేదు. శివ కూడా వాళ్ళతో వెళ్తాడు.)

దీపికా: మీకు టీలు , కాఫీలు బాగా అలవాటు అనుకుంటా మాటిమాటికీ తాగుతున్నారు.

శివ : మా వాడికి మధ్యాహ్నం టీ, నైట్ కాఫీ లేకపోతే నిద్రపట్టదు.

రాజేష్: అంటే దీపికా అదీ ..ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండేది. ఆ స్ట్రెస్ పొగొట్టుకోవడం కోసం టీలు కాఫీలు అలవాటు చేసుకున్నాను.
(వాళ్ళు కాఫీ తాగుతూ మాట్లాడుతున్నారు.)

దీపికా: నాకైతే కాఫీ అంతగా అలవాటు లేదు. మరీ అత్యవసరం అయితే తప్ప తాగాను. కాని నేను కాఫీ బాగా చేస్తాను. నా జీవితంలో నను ఎవర్నైతే బాగా ఇష్టపడతానో. వారికే నేను కాఫీ ఇస్తాను. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం .నా కాఫీ రుచి మా నాన్నకు మాత్రమే తెలుసు.

రాజేష్: మనకెప్పుడొస్తుందో ఆ అద్రుష్టం.. (అని రాజేష్ తమాషాగా అన్నా కూడా దీపికా కి తెలిసిపోయింది తను తనని ప్రేమిస్తున్నాడని. ఇది విని దీపికా నవ్వినా లోపల మాత్రం ప్రేమ నరనరాల్లో ప్రవహిస్తుంది. )
( అలా సరదాగా మాట్లాడుతూంటే అటుగా పోతున్న ఓ దొంగ దీపికా హేండ్ బ్యాగ్ పై కన్నేశాడు. రెప్పపాటు కాలంలో ఆ హేండ్ బ్యాగ్ ను దొంగిలించి పరిగెత్తాడు. అది చూసి రాజేష్ దొంగ వెంట పరిగెత్తాడు. రాజేష్ వెంట శివ, దీపికా పరుగులు తీశారు. చివరికి దొంగ స్టేషన్ బయట దొరికాడు. దొంగని పిడిగుద్దులతో గుద్ది పోలీసులకి అప్పగించారు. నా విలువైన వస్తువులు అన్నీ హేండ్ బ్యాగ్ లో వుండటం వల్ల రాజేష్ చేసిన సాయానికి దీపికా రాజేష్ ని హత్తుకుని థాంక్స్ చెప్పింది. రాజేష్ తటస్థంగా నిల్చోని ఉండిపోయాడు. దీపికా పై ప్రేమ పొంగి పొరిలింది. )

శివ: మామ‌ ట్రైన్ కదిలే టైమైంది .రా.. దీపికా పదా.
(అంటూ వెళ్ళి ట్రైన్ లో కూర్చున్నారు . రాజేష్ ని దీపికా కౌగిలించటం శివ కి ఆశ్చర్యం తో కూడిన ఆనందాన్ని ఇచ్చింది. రాజేష్ అయితే దీపికా హగ్ నుంచి ఇంకా తేరుకోలేదు. దీపికా కీ రాజేష్ ఫోన్ నెంబర్ అడుగుదామని అనుకున్నాడు. నెంబర్ అడిగాడు తను కూడా ఆనందంగా నెంబర్ ఇచ్చింది. ఒకరి నెంబర్ ఒకరు తెలుసుకున్నారు. )

శివ: ఒరేయ్ ఆకలేస్తుంది రా. టైం 9:30 పి.యమ్ ఇక భోజనం మొదలెడదామా?

రాజేష్ : సరే రా. మన బ్యాగ్ లో క్యారేజ్ ఉంది బయటకు తియ్యి.
( భోజనం చేసిన తరువాత వాళ్ళు వాళ్ళ బెర్త్ కి వెళ్లి పడుకున్నారు. రాజేష్ దీపికా కిటికీ పక్కన కాబట్టి ఎదురెదురుగా పడుకొన్నారు. బయట వెన్నెల కాంతి వల్ల రాజేష్ నిద్రరావడం లేదు. కిటికీ కర్టెన్ క్లోజ్ చేసాడు. అయినా కూడా నిద్ర రాలేదు. అప్పుడు తనకు అర్థమైంది . వెన్నెల కాంతి తో సమానంగా ప్రకాశించే దీపికా వుండగా తనకు‌ నిద్రేలా పడుతుందని అప్పుడు అర్థమైంది. తనను చూస్తూనే ఏ అర్థరాత్రో పడుకున్నాడు. )

ఇంకా ఉంది....
wait for episode - 5












© sai@333