...

3 views

మోహనాంగి ఆశలు -1
అనగనగా సింహాపురం అనే గ్రామంలో
అన్నపూర్ణ, విజయభుషనుడు అనే ఇద్దరు దంపతులు ఉంటారు..
వారికి సంతానం లేదు..
సంతాన భాగ్యం కోసం వారు చేయని పూజలు లేవు,
మెక్కని దేవుళ్ళు లేరు,

ఒకానొక రోజున ఒక సమయంలో,
వారికి పండంటి ఆడబిడ్డ కలుగు తుంది...
ఆనందోత్సహాల నడుమ ఇద్దరూ
ఒలలాడారు...
కొన్ని రోజులు తర్వాత
భూషుణుడు భార్యతో..
కలిసి ఓ జోతిష్కుడి దగ్గర కు బిడ్డకు
జాతక చక్రం వేయించేందుకు
వెళతాడు...
జాతకం చూసి
సిద్ధాంతి నివ్వెర పడి,

నోటికి వచ్చింది చెప్పి...
వాళ్ళ ను అక్కడ నుంచి పంపించి
అనుమానం గా చూస్తూ ఉంటే
శిష్యుడు తో
భట్టారకా
వారు తెచ్చిన వ్యక్తి జాతకం
మామూలు మనిషి కాదు..
దేవ వేశ్య అయిన ఊర్వశి నక్షత్ర జాతకం...
కనుక..
పెరిగే శిశువు..
ఇళ్ళాలు కాలేదు ,కాదు కూడ,
ఒక వేళ వివాహం జరిగిన
కాపురం నిలువదు..

అందుకే నాలుగు మాటలు చెప్పి
పంపాను, అంతే కాదు ఆమె
అపురూపమైన సౌందర్య లావణ్య వతి

భాసిల్లుతుంది...

మరి దీనికి సంబంధించిన పరిహారం ..
గురుదేవా..
భట్టా కాలమే ఈ సమస్యకు మందు....

అలాగే ఈమె ఒకరి సానిగా లేదా,
ఆదర్శ పత్ని గా మారే అవకాశం ఉంది...

ఆ శిశువు అందానికి వన్నె తగ్గకుండా
మోహనాంగి అనే పేరు పెట్టారు....
చేతిలో అద్దం లా జాగ్రత్తగా పెంచుకుంటూ ఉన్నారు...

మోహనాంగి మొదటి పుట్టినరోజు సందర్భంగా భూషనుడు ఒక ఛాయ
రంగు మందార మొక్క తమ ఇంటి ముందు నాటాడు....

ఆ మెక్క కు అరుంధతి అని నామకరణం చేసి.. కూతురు తో సమానంగా.. పెంచుతూ వచ్చారు ...
కొన్ని..ఏళ్ళు నిండిన తర్వాత..

మోహనాంగీ.. దుర్గ పూజకు.. తొమ్మిది ఏళ్ల తర్వాత మొదటి సారిగా నాన్న
నాటిన మందార చెట్టు నుంచి మందారాలను కోయసాగింది..

నాలుగు దండలకు సరిపడా పూలు కోసి గులాబీ, బంతి, చేమంతి, కనకాంబర, మల్లె, జాజి, గన్నేరు, పూలతో మాలలు చేసి....

అమ్మవారి కి సమర్పించి మొక్కులు చెల్లించి...

అమ్మ.. శాంభవి...
లలిత రూపిణి,
కాత్యాయని..
అంటూ పాడుతూ ఉంటే ఊరంతా
ఆలకించి తరించారు...

పదిఐదో ఏట....
పరువం వికసించించే వేళ...
బాల త్రిపుర సుందరి దేవీ పూజ..
చేసి.. రుణం తీర్చి సంతోషించారు
భుషన అన్నపూర్ణ లు...

ఇరవై ఏళ్ల వయసులో ఉన్న... మోహనాంగి.. అట్ల తద్ది చేసి మంచి మెగున్ని కోరుకుంది... కానీ ఊయల
మాత్రం ఊగలేదు... ఉపవాసం కారణంగా ఒంట్లో సత్తువ.. లేక
పోవడం వల్లే తాను చేసిన పూజ పూర్తవ్వల్లేదు...

అది విని తల్లిదండ్రులు.. కూడా నోరు..
విప్పలేదు.. కాలం నవ్వి ఊరుకొంది..



21సంవత్సరాల వయసు మీద పడిన తర్వాత మోహనాంగి.. తన భర్త నుంచి తాను ఆశలు సజీవంగా ఉన్నట్టు ఊహించుకొనేది...
జలపాతం కింద ఇద్దరూ ప్రణయ నాట్యం చేస్తూ,
మెలికలు తిరుగుతూ,
స్నానాలు చేసే సమయంలో తన వెనుక నుంచి నడుం చుట్టూ తిరిగే
క్షణాలు..

అతని హృదయం మీద తల వాల్చి,
అతని పెదవి మీద ముద్దు పెట్టుకోవడం కోసం,
అతని చేయి పట్టుకుని అగ్ని చుట్టూ
ఏడడుగులు వేయాలని,
ఇంకా ఎన్నో రకాలుగా ఆమె..
తనలో తానే సిగ్గు పడుతూ,
మధన పడుతూ ఉంటే తండ్రి కి చెప్పి
దుర్గా దేవి ఆలయం వద్దకు వెళ్లి వస్తుండగా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్న ముసలావిడ చేతిలో
ప్రసాదం లడ్డూ పెట్టి వచ్చింది...

నాలుగు వారాల తర్వాత వర్షం కారణంగా పెళ్ళి సంబంధం వాయిదా పడింది...
అతని పేరు వీర శేఖరుడు... అంత
సుకుమారుడు కాదు, వయసు కు తగిన అందగాడు...,
కొంచెం సిగ్గుగాఉండే వ్యక్తి..
అని అతని చూస్తే అర్థమవుతుంది
అందరికీ..

ముత్యాల ముగ్గు పెట్టి మరీ అంగ రంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది..

‌భర్త పై తాను పెట్టిన ఆశలను, ఆశయాలు, యజ్ఞకుండం లో నే
వదిలి బయటకు వచ్చి తన తల్లిదండ్రులుకు వీడ్కోలు చెప్పి అక్కడ
నుంచి నేరుగా అత్తవారింటికి పల్లకీ లో భర్త తో పాటు తన తోటి పెరిగిన
తోబుట్టువు మందార మొక్కఅంటు ను
తోడు తెచ్చుకున్నది..


కోడలు కు ఆరతి ఇస్తూ నవ్వారు..
అత్తమామలు,
లంకంత ఇంటిలో తానే తిరుగులేని
మహారాణి.. అత్తమామలు వేధింపుల గోల లేదు, ఆడపడుచు నస అసలు లేదు.. మరుదుల దురదలు లేవు,
పుట్టిన ఆడపడుచులు రాణులై
రాజస్తానాలల్లోవెలుగు తున్నారు..

ఇంట్లో ఉన్న వస్తువులను,
నిర్మాణం,
భర్తను చూస్తూ గదిలోకి నడిచింది
మోహనాంగి...

ఆరోజు వారికి మొదటి రాత్రి...
ఆ నాటి పున్నమి వెన్నెల కంటే
తానే స్వయంగా మెరుస్తూ, ఊహాలేవో
ఆశలేవో,మనసులో తలచు కుంటూ, సంబర పడుతూ,
ఎదురు గా ఉన్న భర్తను చూసి సిగ్గు తెచ్చుకుని మెలికలు తిరుగుతూ
వుంటే పెనిమిటి పక్కనే కూర్చుని..
గంటల పాటు మాట్లాడటం మొదలు పెట్టిన తరువాత కూడా మోహనాంగి
తరువాత యద్దం మొదలవుతుంది
అని ఆశతో ఓపికగా వినసాగింది..
చివరకు అతని హృదయం మీద తల వాల్చి నిద్రపోయింది.. తను..
********************************

ఉదయం పూట పూలు, బట్టలు చూసి చూడగానే ఆమె భర్త ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వాడని అర్థం చేసుకుని సాయంత్రం పూట అందరూ
వినేట్టు.. వంటింట్లో అరిచింది...
పనిమనిషి ఎవరూ లేని వంట ఎలా ఉంటుందో అని..
అత్తగారు వచ్చి.. రేపటి నుంచి సీతాలు అనే అమ్మాయిని పనిలో పెడుతున్నట్లు చెప్పి....
దగ్గరకు తీసుకొని గారం చేసింది..
తన ఇంట్లో వంద మందికి వండి వార్చిన తాను తన భర్త వయసు వంట
చేయలేదని ఆమె బాధ....
అత్తగారు కు కొడుకు బిడియం గురించి
బాగా తెలుసు కాబట్టి కోడలి చిరు కోపాన్ని అర్థం చేసుకున్న తర్వాత
అక్కున చేర్చుకోవడానికి ప్రయత్నించింది...

మోహనాంగికి మమతకు,ప్రేమకు,
కొదువ లేని ఆ ఇంట్లో మొగుని వేలుకొరికే భాగ్యమెక్కటే లోటు..
తనలో
తానే ,
తరంగాలై
వరదలా,
పొంగే
పారే
జారే,
సొగసు
పొంగులు
ఒలిచే
తలిచే
పురుష
స్పర్ష
కోసం
ఆమె ఆరాటం
ఆమె పోరాటం,
పెదవులు ఎర్రగా తొనికిన
ప్రతిక్షణం,
ప్రతిరోజూ
మళ్ళీ మళ్ళీ
ఎదురు చూస్తూ ఉంటే
అది జరిగే పని కాదని స్పష్టం
అయ్యేది ....

మోహనాంగి అందానికి ఆ ఊరిలో ఉన్న మగపు మీసాలన్నీ జల్లు మన్నాయి...తనకు మాత్రం..
భర్త భోజనం కోసం ఆవిర్లు పడుతోంది...
తను స్నానం చేసే సమయంలో తన
భర్త తో చేసే పనులను ఊహించు
కుంటూ, కల్పించుకుంటూ, జలకమాడేది...

పక్కన కూర్చుని భోజనం చేస్తుంటే..
తన చేతితో తినిపించాలని,
ఏవేవో ఆలోచనలు మది లోని రాగాలు
....
అతని స్పర్శ కోసం,
అతని వేడి శ్వాస కోసం,
అతని పిలుపు కోసం,
ఆమె మహర్షి లా
తనువు తపము చేయసాగింది...
మోహనాంగి తన తండ్రి నాటిన మొక్క నుంచి తెచ్చుకున్న మందార పౌత్రాన్ని
పెరట్లో నాటి పాలు పోని సందర్భంలో
తన ఆలోచనలు మందారానికి చెప్పుకునేది...

ఆమె అంత కన్నా ఏం చేయగలదు,
ఆమె అంత కన్నా ఎలా చేయగలదు,

అందమైన నడుము,
సొగసైన పాలిండ్లు,
పట్టు గులాబీ రంగు, చంపేటి చుపుల
కళ్ళు...
హంస నడక,
పనస తొనల వంటి పెదవిద్వయం,
జాబిల్లి వంటి ముఖము,
మన మోహనాంగి.. అందాల వివరాలు, జవరాలు, సవరాలు,
పవణాలు...


భర్తను కూడా తన అందంతో పోల్చుకుంటే అతను సగమే ఉంటాడు...
తన ఆలోచనలు వేరు, అతని యాస వేరు...

అనుకోని విధంగా ఒక రోజు భర్త కొంచెం నలతగా కనిపిస్తే
వైద్యం చేయడానికి వచ్చిన అతను

మరో పెళ్లి ఎందుకు చేసారు,
మీ కొడుకు కు సంతానం కలిగే అవకాశం లేదని చెప్పిన మరో ఆడపిల్ల
గొంతు కోసిన పాపం మీకే తగులు
తుంది...
5ఏళ్ళ వయసు లో మర్మ ప్రదేశంలో అయిన గాయం సామర్థ్యాన్ని
హరించింది....
మీ కొడుకు గురించి నేను ఇంత కంటే ఎక్కువ చెప్పకూడదు
కనుక ఆ అమ్మాయి తన తండ్రి కి చెప్పి
మీ రే మరో సంబంధం చూడండి.

నేనిచ్చే మందులు వాడటం వల్ల గాయం మానుతుందే మో కానీ,
మామూలు మనిషి కాలేడు...
అని అంటూ అక్కడి నుంచి నేరుగా తన ఇంటికి వెళ్లి పోయాడు.. ఇది విన్న
తల్లిదండ్రులు విలపిస్తుంటే గోడచాటు నుంచి వింటూ ఉన్న మోహనాంగి..
అక్కడి కక్కడే కూలిపోయింది....

ఆత్మ హత్య చేసుకుందామనుకుంది....
తండ్రి అప్పులు, తల్లి అనారోగ్యం,
అడ్డు పడ్డాయి....
తనని ఎవరో ఎడారి ప్రాంతంలో
పారేసినట్లు,
నరకంలో చిక్కుకున్నట్లు,
ప్రాణులు లేని భూమి మీద లాక్కెల్లి నట్లు, ఊహించుకుంది...

కొండంత ఆస్థి ఉన్న కూడా అయిన వాళ్ళ కోసం తన వివాహం చేసుకోవడం జరిగిందని తనకు
అర్దమయింది.. .....

తన చీకటి గదిలో కన్నీళ్ళే తన నేస్తాలు......
ఒకానొక సమయంలో తాను
మాయావతి నదీ తీరంలో విహారం కోసం వెళ్ళింది...
అక్కడ నదీ జలాలు లో ఓ యువకుడు స్నానం చేయడం చూసింది మోహనాంగి..

అంతే.. తనను తాను మర్చిపోయి
గంటల పాటు అతని అందం, శరీరం, విశాల వ్యక్తస్థలం, బుజాలు చూస్తుంటే
తన శరీరం లో లోపల ఏవో
కదలికలు , మార్పులు, కన్నే గుండె
జల్లుమనే భావన..,
బుగ్గలు ఎరుపెక్కి,
సిగ్గులు మెరిసే,
ఆనంద డోలికలు,
అతని ఒంటి పై,
జారుతూ ఉన్న నీళ్ళలా,
పుట్టి ఉంటే ఎంత బాగుండేది,

అతని రూపం,
అపురూపం,
అతని ముఖం ఆమె కు
కనిపించడం లేదు కానీ,
శరీరం మొత్తం కనిపిస్తోంది...

ఇంతలో తన భర్త దూరంగా వస్తుండటంతో..

ఏమీ తెలియనట్టు
మోహం భర్త వైపుకు తిప్పి చూడసాగింది..

ఆ అపరిచిత అందగాన్ని ఆపాద మస్తకం,తన రెండు కళ్లతో మింగేస్తూ,

గుర్రపు బండిలో భర్త పక్కన కూర్చుని
ఆలోచన చేయసాగింది...

బండి మోహనాంగీ మనసు లాగే
నిదానంగా నడుస్తూ పోయింది...

ఇంటికి వచ్చిన తరువాత ఎదురు గా
ఓ తన వయసు అమ్మాయి ని చూసి
ఆశ్చర్యంగా చూస్తుంది..మోహనాంగి..

ఈ పిల్ల ,పనిపిల్ల ,మెహన అడిగావు కదా.. మన పాలేరు కోడలు..
మీ పెళ్ళప్పుడే తనకు మనువు జరిగినది.. అంటూ.. పరిచయం చేసుకుంది అత్త రుక్మిణి..

ఓ..
అలాగా.. అత్తమ్మ సరే ఈ పిల్లను
రేపటి నుంచి పనిలోకి రమ్మని చెప్పండి.. నేనే ఈ పూట
భోజనం చేసి వడ్డించి పెడతామని చెప్పి పనమ్మాయి ని...
అక్కడ నుంచి పంపించి స్నానం చేసే
గదిలో వెళ్ళిపోయింది...
కోడలు మార్పుకు భర్త, అత్తమ్మ, మామ లు చూస్తూ ఉండి పోయారు....

అతని అందం ఆమె. ..ఆకలి తీర్చింది..
తన వాళ్ళ ఆకలి తీర్చేందుకు వంట గదిలో యుద్దము మెదలు పెట్టింది...
64 రకాల ఆహార పదార్థాలను
తయారు చేసి
భర్తకు స్వయంగా.. తినిపిస్తుంటే
అత్తమామలు కన్నీరు పెట్టుకున్నారు....
ఆ రోజు ఆమె.. బండెడు బట్టలు ఉతికి,
పూజ గది,
వసారా,
వాకిళ్ళు,
శుభ్రం చేసి....

మనసులో ఆ అందగాడి అపురూపం తలుచు కుంటూ,
తనలో తాను నవ్వుతూ,
తుళ్ళుతూ,
ఆనంద తాండవం చేస్తూ......
భర్త ఎదపై చిన్నారి లా
నిదురించింది...

ప్రాతఃకాలం లో ఇంటి పనులు పూర్తి చేసి, పూజ, వంట, వార్పలు,అన్నీ ..
ముగించుకుని పనిపిల్ల కోసం..
ఎదురు చూస్తూ ఉండగా
మాటల్లోనే
పనమ్మాయి...
వచ్చి..తనను పలకరించింది...

నీ పేరు అమ్మాయి..

సీతాలు అమ్మ..
మా వోడు.. సీత అని పిలిచే వాడు..


సరే ఈ రోజు పని మొత్తం నేనే
చేసేసాను ఇద్దరూ కలిసి మాయావతి
నదీ తీరంలో ఉన్న అభయ దుర్గాదేవి ఆలయానికి వెళదాం...
అని గదిలోకి పిలిచి,
బంగారం రంగు పట్టు చీర సీతాలు వద్దని చెప్పినా వినకుండా బలవంతంగా కట్టింది..

ఇద్దరూ పారిజాతం పువ్వుల బుట్టతో
గుడికి వెళ్లి మెక్కులు చెల్లించి..
అక్కడి నుంచి నేరుగా తన ఇంటికి వెళ్లి
పొమ్మని.. అంటే అమ్మా.. మరి చీర
అని దీర్గాలు తీస్తుంటే నీకే
సీతాలు...
ఇంటికి వెళ్లి జాగ్రత్తగా పెట్టుకుని ఉండమని పంపింది....
గుర్రం సకిలింపు బంగ్లా రహదారుల వెంట వినబడుతూ ఉంటే
బండి ఇంటికి కదిలింది......

ఉదయం పూట సీతాలు మోహనాంగీ
కంటే ముందే నిద్ర లేచి ఇంట, వంట పనులు పూర్తి చేసి అమ్మ గారిని
నిద్రలేపి చందన స్నానం చేయించింది,
ఒంటికి సౌగందాలు పులిమి,
కొంగొత్త పట్టు వస్త్రాలు కట్టి,
ముత్య,బంగారం,వెండి,
ఆభరణాలు దరింపజేసి...

వేడి వేడి అల్పాహారం తెచ్చి పెట్టిన తర్వాత విసనకర్ర విసిరి..
పడుకోబెట్టి..
మిగిలిన పనులు చేయడానికి
వెళ్ళింది....

500ఎకరాల మాగాణి,
200ఎకరాల మామిడి తోటలు,
250ఎకరాల కొబ్బరి తోట,
50ఎకరాల కూరగాయల తోట,
ఇంటికి ముందు 30ఎకరాల పెరటి తోట, ఇవీ మోహనాంగి అత్తమామలు
యొక్క ఆర్ధిక స్థితి.....

తరాలు దాటినా కరగని ఆస్తి వారి
సొంతం.. వంద మంది పాలేర్లు,
50మంది పశువుల పాలకులు,
మందీ మార్భలం ఉన్న ఇల్లు అది....
భర్త సుఖం. తనకు అందని ద్రాక్ష....
అంతా ఇచ్చిన ఇదో దేవుని శిక్ష.....
ఆమె ప్రేమ అతడి శ్రీరామ రక్ష,

సీతాలుకు 20ఎకరాల మాగాణి,
ఆవులు, ఎద్దులు, మేకలు, కోళ్ళు
ఉండేవి.. ఇప్పుడు కొన్ని కోళ్ళు,
ఒక ఆవు మూత్రం..
ఉంది.. ఆవును భర్త.. తొలుకెలతాడు...



ఆస్థి లేకపోయినా గుణం వదలేలేదు
తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం మోహనాంగి అత్తమామలు వంశానికి చెందిన వారి కుటుంబాలకు
ఊడిగంచేస్తూఉన్నారు...
సీతాలు భర్త వంశ పారంపర్యముగా
.....
ఓ రోజు ఉదయం తన పెరటి మందార
చెట్టు కు చాముండి అనే పేరు పెట్టి..
సీతాలు తో కలిసి నీరు పోసి..
పూలు కోసి....
పూజలు చేసి ప్రసాదం పంపిణీ చేసింది.. మోహనాంగి...

రోజులు గడిచినా తన కలల పురుషుడు.. కనిపించక పోయే సరికి తను కొంచెం విచారంగా ఉంది .....
భర్త పరిస్థితి మరింత దారుణంగా ఉందని తాను ఇలా ఆలోచిస్తూ ఉంటే
తప్పు అని తెలిసినా తనకి అతని
మీద ఉన్న ఆశో, కోరికో,
ఆమె ని మరింత చేరువ కావడం వల్ల
తను అతన్ని మర్చిపోలేక పోతోందీ
....................................................
ఒక రోజు బయటకు వెళ్తూ ఉంటే దూరంగా ఒ పూటకూళ్ళ ఇంట్లో
కాగడా వెలుగు లో... అస్పష్టమైన రూపంలో తన మది మన్మధుడు
కన్పించాడు..తన ఆనందాన్ని
వర్ణించటానికి.. మాటల్లేవ్.. చేతల్లేవ్..

అతన్ని చూసి అక్కడే ఓ ఆట ఆడుతూ తన వశం చేసుకోవాలని ఆమె చుట్టూ ఉన్న ప్రజల మధ్య ఉన్న
తాటి ఆకులు తీసుకు వచ్చి..
అతని మీద నాలుగు వేసింది..
అటు ఇటు తిరిగి చూస్తే..
ఎవరు ఆ పని చేసిందని అతనికి...
అర్ధం కాలేదు....

సీతాలు కు తన భర్త విషయం గురించి
తెలుసు కాబట్టి మోహనాంగి.. తన
ప్రేమ వ్యవహారం గురించి చెబుతూ
ప్రియుడు అందాన్ని మరింత వర్ణన చేస్తున్న సమయంలో అమ్మ గారు ఇక
ఆపండి...మీరింక చెప్పడం ఆపకపోతే
నేను... మా వోడు నీ వదలి మీ ప్రియుడు వెంట పడాల్సి వస్తుందని
గట్టిగా నవ్వుతూ ఉంటే మోహనాంగీ కూడ నవ్వి ఇలా అంది..

నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావ్ సీతాలు
అంటే.
జీవితం ఆడుకుంటుంటే ఓ.. బొమ్మ లా
మిగిలిన వారిలా ఉన్నారమ్మా...

అవును నిజమే కానీ మనిషి ని గా
తప్పదు నాకు.. అంటూ కన్నీళ్లు పెట్టుకుని మొహం మీద చేతులు పెట్టుకొని చింతించసాగింది....

అమ్మ గారు ప్రేమ లో ఉన్న మీరు ఇలా
ఏడవకూడదు... అంటూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తే మోహనాంగి..
ఊరుకుంది............. తనకు బాగా తెలుసు... తనకు మల్లీ అతను కనిపిస్తాడని.... అందుకే నిరాశగా ఉండక..... ఉత్సాహంగా ఉండసాగిందీ...
ఒక రోజు పర్యటన సందర్భంగా ఇరువురు బయట కలుసుకుని
సీతాలు..అతని పేరు తెలుసు కుంది...
వెను వెంటనే.
ఆ విషయం అమ్మ గారు కు చెప్పగా..
ఆమె సంతోషం తో ఎగిరి గంతులు వేస్తూ.. ఆమెకు ముత్యాల దండలు బహుమతి గా..ఇస్తుంది..
ఎం చేద్దామని అడిగితే..
ప్రేమ లేఖ రాసి పంపుదామమ్మా...
సమాధానం వస్తే మాత్రం వదలకండీ..
అతన్ని..
మరి సమాధానం రాకపోతే...
వస్తుంది అమ్మ గారు..
ఈ ఊరు ఊరంతా మీమీద మనసు పడింది... అతనో.. లెక్క..

ఏమనుకుంటాడో... సీతాలు నా గురించి... ఏమి అనుకోకుండా ఉండాలంటే... మీ పేరును రాయకండి..
మరి రాసింది ఎవరో అనుకుంటే..??
ప్రేమ అనే పేరు పెట్టి రాయండి..
అందులో మీ అనుభవాలు, అనుభూతులు.. పంచుకోండి
ఇట్టే అల్లుకు పోతాడు..
అది సరే గానీ లేఖ పంపే వారెవరు
తెచ్చే నాదుడెవరు

సీతాలు అందుకే మా ఇంట్లో ఉన్న చిలుకకు శిక్షణ ఇచ్చి నేను పంపుతాను
అది నచ్చింది అంటే సమాధానం
వెంటనే వస్తుంది... నచ్చక పోతే....
ఆలస్యం అవుతుంది.. అంతే..

సరే రాద్దాం పదా అంటే సీతాలు.. అమ్మో చంపారు కాదు... ఇక్కడ వద్దు
బిల్వ బిలం దగ్గర రాద్దాం అంటుంటే

అదెక్కడుంది.. ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంది..
ఆ..
కొంచెం దూరంగా ఉంది.. పదండి..
అంటూ.. సీతాలు బిల్వ బిలం తీసుకు వెళ్ళి అక్కడ ఉన్న అరటి ఆకులో
లేఖ రాయడం మొదలు పెట్టింది...
సీతాలు అమ్మ గారు లేఖలో దస్తూరి
తెలియకూడదని నేను అన్ని లేఖలు రాసి మీ తరపున పంపుతాను..
మీరు చెప్పండి ..అనగానే..
గొంతు సవరించుకొని మోహనాంగి
చెప్పడం మొదలు పెట్టింది...
చివరకు నాలుగు ఆకులు పూర్తిగా రాసి..
చివర్లో.... ఇట్లు మీ హృదయ దాసి...
ప్రేమ అనే పేరుతో ముగించి.
...కిన్నెర అనే పేరు గల తన చిలుకకు కట్టి..
ఉదయ శేఖరుడు కు అందజేయాలని
చెబుతుంది...
చిలక రెక్కలు కొడుతూ..
ఆకాశంలో ఎగర గానే కిన్నెర తన స్నేహితుడు కింజర కలిసి ఆ నాలుగు
ఆకులను చెరి రెండు పట్టుకుని..
వెళుతుంటే...
సీతాలు, మోహనాంగి... ఎవరు ఇంటికి వారు వెళ్లి పోతారు...
సాయంత్రం పూట భోజనం చేసి కాస్తా.
విశ్రాంతి తీసుకోవాలని నడుం వాల్చి..
పడుకుని ఉండగా కిన్నెర జంట ఆ
ఆకులు అతని ముందు..
పడేసి.... అందగాడా...ఈ ..లేఖ.. నీ ప్రియురాలు రాసింది...
చదివి సమాధానం చెప్పాలని పట్టు పట్టింది...
రంగుల చిలుక.. ప్రేమ లేఖలు కూడా తెస్తుందా అని నవ్వుతూ..
వాటిని తీసికొని చదవడం మొదలు పెట్టాడు..

ప్రియమైన నా హృదయ ఉదయనుడికి. .

నేను మీ ప్రాణ సఖిని...
మిమ్మల్ని తొలి సారిగా మాయావతి నదీ తీరంలో విహారం చేస్తూ చూశాను..
మన్మధ రూపం లో ఉన్న మిమ్మల్ని చూసి నేను చాలా ఆనందం చెంది,
మిమ్మల్ని అమాంతం వీక్షించాను...
మీ అందం నాకు ఓ వరం...
ఓ అందమైన పరవశం,
మా భర్త గారు నిరుపయోగంగా ఉన్న సమయంలో మీరు నాకై కనిపించడం
నా అదృష్టం..
నా సుఖం,
మీ అంకితం,
నా పరువపు తొనలు వొలిచే అవకాశం
మీకిస్తూ
ఇట్లు..
మీ ప్రేమ....

అది విని ఉదయనుడు ఒ తామ్రం మీద ..

క్షమించండి నేను చండాల కులానికి చెందిన వ్యక్తి ని.. నా అందం మీ హృదయం కదిలించి వేసిందని నాకు
తెలీదు ...
అయిన నేను... మరో అందమైన.
అమ్మాయి నా హృదయం లో ఆరాదిస్తూ ఉన్నాను...
మీ స్పందన అభినంధనీయం...
ఆమె పేరు మోహనాంగి...
అపురూపమైన అందం గల కన్నె పిల్ల,
ఆమె నా సర్వస్వం...
దయచేసి మీ కోసం వేరే యువకుడు ని చూసి వెతుక్కొండి
అని ముగింపు రాసి..
తిప్పి పంపిన తర్వాత...
అది చదివి సీతాలు మోహనాంగికి
ఆ విషయం చెప్పి ఆనంద పడుతుంది..

తర్వాత మోహనాంగి అది నేనే అని
బిల్వ బిలం వద్దకు వచ్చి తనను కలుసు కోమని లేఖ రాస్తుంది....

తరువాత ఇద్దరూ కలిసి బిల్వ వనంలో
కలుసుకుని తమ గురించి తాము చెప్పుకొసాగారు...

మరునాడు అంటే తరువాత వారంలో
కలుసుకుని మోహనరాగాలు పలికించుకుందామని ఇద్దరూ కూడబల్కుకున్నారు...

వెళ్ళే ముందు ఉదయనుడు
మోహనాంగి ని గట్టిగా హత్తుకొని
తన మెలితిరిగిన మీసం కలువ బుగ్గల
కన్నె.. ను కోస్తూ ఉంటే.. ఇచ్చిన తీపి
వీడ్కోలు.. మరువలేనిది....














© గోవింద్ @...