...

12 views

#నిజమైన ప్రేమ#
"హేయ్ హనీ ఆగు వర్షం వస్తుంది,తడిస్తే జలుబు చేస్తుంది ..నా మాట వినమ్మ " అంటూ శృతి తన కూతురికి హెచ్చరిస్తూ....వంట గదిలోకి వెళ్ళింది....అప్పుడే శృతి భర్త అమర్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు....వర్షం పడుతుంటే త్వరగా వచ్చాను అని శృతి తో చెప్పాడు అమర్..హనీ అప్పుడే డాడీ డాడీ అంటూ ఇంటి వరండాలోకి పీల్చుకొని పోయి వర్షాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు.ఇక శృతి వేడి వేడిగా శ్రీవారికి పకోడీలు చేసి తీసుకొని వచ్చింది...ముగ్గురు అల వర్షపు బిందువు లని చల్లుకుంటూ,పకోడీలు తింటూ..ఉన్నారు.

కొద్దిగా వర్షం తగ్గాక ఇంటి గేట్ తోసుకుంటూ....శృతి వయసులో ఉన్న ఒక ఆడమనిషి..వచ్చింది,అమర్ చూసి ఆశ్చర్యపోయాడు.ఒక పది నిమిషాలు తరువాత "నువ్వేంటి దివ్య ఇక్కడ?,ఏమైంది?" అంటూ ఆమెను పరామర్శించారు.శృతి,హనీ ఎవరా అనుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు తెగ చూసుకుంటున్నారు.శృతి ఇంట్లోకి రండి అని పిలిచి హాల్ లో కూర్చో పెట్టింది,అమర్ కూడా కొంచెం అయోమయంగా మొఖం పెట్టీ మళ్లీ "దివ్య ఏమైంది చెపు" అంటూ అడిగాడు. అప్పుడు దివ్య ఏడుస్తూ "నా కళని నిజం చేసుకోవడానికి నేను నిన్ను వదిలేసి ఇంకో మార్గం వేతుక్కున్నందుకు ప్రతి రోజూ నాలుగు గోడల మధ్య నలిగి పోతున్నాను.ఆ నరకం చూడలేక నా సహనం చచ్చి పోయింది..నీ కోసం వెతికి వెతికి ఇదిగో నీ ఇంటి అడ్రస్ కనుక్కొని ఈరోజు ఇలా నీ ముందు ఒక ప్రశ్నగా మిగిలిపోయాను" అంటూ దివ్య అమర్ కి చెప్తున్న బాధను విన్న శృతి ఇద్దరినీ అర్థం చేసుకొని....కుదుట పడింది..

అమర్ నీ పిలిచి శృతి "చూడండి ఆమె ఒకప్పటి నీ ప్రియురాలు , అప్పుడు నీ విలువ తెలియక నిన్ను వదిలేసింది.ఇప్పుడు తన భర్త విలువకి నోచుకోక నీ కోసం వచ్చింది.దివ్య సమస్యను పూర్తిగా కనుక్కొని ఆమె భవిష్యత్తు నీ కొత్త దారిలో నడిపించాలని కోరుకుంటున్నాను.." అంటూ చెప్పింది.శృతి మాటలు విన్న అమర్ ఒక్కసారిగా ఆమె ఓర్పుకి ఏమీ ఎదురు చెప్పలేక సరే అంటూ తల ఊపాడు.

అమర్ దివ్యను "నీ సమస్య ఏంటి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అంతే కదా,నీ కల నీ నువ్వు నెరవేర్చు కోవాలి అంతేనా లేక ఇంక ఏమైనా పెద్ద సమస్యలు ఉన్నాయా? " అంటూ ఆరా తీశాడు... అప్పుడు దివ్య శృతి వైపు చూస్తూ.."నన్ను క్షమించు అమర్ ,నీ మనసును అర్థం చేసుకోక నిన్ను వదిలేసాను,అల అని నా భర్త మీద ప్రేమ లేక కాదు.నువ్వు చెప్పిందే నిజం,నా కాళ్ళ మీద నేను నిలబడాలి మరియు నా కళని నేను నెరవేర్చు కోవాలి.అందుకు నువ్వే నాకు దారి చూపించాలి " అంటూ అర్తించింది.తన మాటలు విన్న శృతి ఎక్కడో ఒక మూల దివ్య మీద సందేహం ఉన్న కూడా పట్టించుకోక దివ్యకు అండగా నిలబడి తన ఇంట్లోనే స్థానం ఇచ్చింది.

అమర్ శృతి వైపు చూస్తూ...నీకు ఏమైనా పిచ్చి ఎక్కిందా దివ్య ను ఇక్కడ ఉంచడం ఏంటి ,తనకు తోడుగా ఉండటం సరే కానీ మరి నీ మంచితనం హద్దులు దాటుతుంది అంటూ హెచ్చరించాడు...అందుకు శృతి చూడండి అమర్ గారు ఒకప్పుడు కాదు అంటూ ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది అంటే మీ మీద ఎంత నమ్మకం కదా తనకి అంటూ...అమర్ నీ మాటలతో మాయ చేసింది శృతి.

దివ్య నీ శృతి ఇంటి లోపలికి తీసుకెళ్ళి తను వుండే గదిని దివ్యకి చూపించి ఇదిగో ఈరోజు నుండి నువ్వు ఇక్కడే పడుకోవచ్చు అంటూ...టవల్ ఇచ్చి స్నానం చేసి రా అందరం కలిసి డిన్నర్ చేద్దాం అంటూ ప్రేమగా చెప్పింది.దివ్య స్నానానికి వెళ్ళాక అమర్ శృతితో "తను,నేను ఒకప్పటి ప్రేమికులం అని తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తున్నావ్ అంటే నీ గుణానికి నా వందనాలు.కానీ దివ్య ఇక్కడ ఉండటం సరి కాదు అర్థం చేసుకో శృతి" అంటూ ప్రాధేయ పడ్డాడు. అప్పుడు శృతి "నా భర్త ఎంత మంచివాడో నాకు తెలుసు కదా" అంటూ సింగిల్ లైన్లో కొటేషన్ ల చెప్పి వంట గదిలోకి వెళ్ళి వంట ప్రారంబించింది.

ఈ లోపు దివ్య స్నానం చేసి వచ్చి,హనీ నీ దగ్గర కు తీసుకొని ,నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు,ఎన్నో క్లాస్ ,ఏ స్కూల్ అంటూ..కబుర్లు అడుగుతుంది.అంతే తడువుగా శృతి వేడి వేడిగా డిన్నర్ కి అన్ని సిద్దం చేసి టేబుల్ దగ్గర పెట్టింది శృతి.శృతి,దివ్య,హనీ,అమర్ అందరూ కలిసి డిన్నర్ చేసి కాసేపు కబుర్లు ఆడి ఇక నిద్రపోయారు.

మరసటి రోజు ఉదయం టిఫిన్ చేశాక అమర్ దివ్య పని మీద బయిటికి వెళ్లి దివ్య భర్త గురించి ఆరా తీయటమ్ మొదలు పెట్టాడు.ఇంట్లో శృతి దివ్య చేసే ప్రతి పనిని,మాటను పరిశీలిస్తూ ఉంటూ ...ప్రేమతో ఉంటుండేది.అమర్ దివ్య భర్త గురించి విచారించగా దివ్యని మోసం చేసి ఇంకో ఆమెతో ఉన్నాడని తెలుసుకున్నాడు..దివ్య పరిస్థితి తలుచుకొని అమర్ చాలా బాధ పడుతు ఇంటికి వచ్చాడు.తెలుసుకున్న విషయాన్ని శృతి తో చెప్పాడు,ఇక శృతి,అమర్ ఒక నిర్ణయానికి వచ్చి దివ్య కోరికను తీర్చాలని అనుకుంటారు..

ఆ రోజు నుంచి అమర్ దివ్య కి ఒక మంచి స్నేహితుడు ల ఉంటూ తనకు అండగా ఉన్నాడు,ఇక శృతి దివ్యకి గొప్ప ఫ్యాషన్ డిజైనర్ కావాలని కోరికను తెలుసుకుంది.శృతి కూడా పెళ్లికి ముందు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదవడం తో దివ్య కి సృతినే టీచర్ గా మారి మెలకులవలు నేర్పించేది..ఒక రోజు శృతిని అమర్ "నువ్వు ఇంత చదువుకున్నావా! " అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు శృతి చిన్న నవ్వు నవ్వి పని చూసుకోడానికి వెళ్లి పోయింది.

దివ్యను ఎప్పుడు కూడా చిన్న చూపు చూడటం కానీ,చులకన చేసి మాటలు మాట్లాడటం కానీ శృతి చేయలేదు,తనని సొంత చెల్లి లా ఆదరించి తన ఎదుగదలను దివ్యలో చూసుకుంటూ వచ్చింది.ఒక మూడు నెలల కి మొత్తం కోర్సు కంప్లీట్ చేసింది దివ్య, ఎగ్జామ్స్ రాసి టాపర్గా నిలిచింది.కొన్ని నెలలకి ఫ్యాషన్ డిజైనింగ్ కంపెటిషన్స్ జరిగాయి అందులో దివ్యను పార్టిసిపేట్ చేసేలా శృతి ప్రిశ్చాహించడం తో అందులో పాల్గొనింది.మొదటి సారి వేళ ప్రజల ముందు ,గొప్ప జడ్జేస్ ముందు ఒక కంపెటిషన్లో పాల్గొనడం దివ్యకి అదే మొదటి సారి ,శృతి నీ మనసులో తలుచుకొని దివ్య ధైర్యంగా షో చేసింది...తన మొదటి షో జడ్జిస్ అందరికీ బాగా నచ్చడంతో మొదటి గెలుపు ను అందుకుంది..శృతి ,అమర్ చేసిన మేలు కి కృతజ్ఞతగా దివ్య అమర్,శృతి చేతుల మీదుగా బహుమానం అందుకుంది...

ఈ షో మొత్తం లైవ్ టెలీ కాస్ట్ కావడంతో దివ్య భర్త దివ్యను షో లో చూసి ఆశ్చర్య పోయాడు.రెండు రోజుల తరువాత దివ్యను వెతుక్కుంటూ దివ్య భర్త అయిన శేఖర్ అమర్ ఇంటికి వచ్చి దివ్యను క్షమంచమని అడిగాడు. అప్పుడు దివ్య ధైర్యంగా శేఖర్ నీ లాగి చెంప మీద కొట్టి "నేను నీతో రాను,నీకు ముందు కనిపించలేదు.నా విజయం కేవలం అమర్,శృతి ల వల్లే జరిగింది,నన్ను అందరూ గుర్తించాక చివరిగా నా భర్త గుర్తిచెంత స్థాయికి నేను దిగజారలేను..ప్లీజ్ దయచేసి వెళ్ళిపో " అంటూ గట్టిగ మాట్లాడింది. అప్పుడు శృతి "తను తప్పు తెల్సుకుని వచ్చాడు,మళ్లీ నువ్వు అదే తప్పు చేయొద్దు దివ్య.నువ్వు ఈ స్థాయికి రావడానికి మాత్రం పునాది అతనే వేశాడు దివ్య అది మరచిపో కు.శేఖర్ తో తిరిగి కొత్త జీవితాన్ని మొదలు పెట్టు" అంటూ మంచి మాటలు చెప్పి దివ్య మనసును మార్చింది.

శృతి చేసిన మంచికి అమర్ కి నోట మాట రాక "శృతి ఒకే ఒక మాట అడగాలని ఉంది అంటూ..నేను ప్రేమించిన అమ్మాయి దివ్య కాబట్టి నా దగ్గరికొచ్చి నన్ను అర్థించింది కానీ నీకు ఏమీ కాదు ,దివ్యను కొట్టే రైట్ ఉంది నీకు అలాంటిది ఇదంతా ఎందుకు చేశావ్?" అంటూ అడిగాడు అమర్. అప్పుడు శృతి "చూడండి ప్రేమ అంటే నా దృష్టిలో చాలా విలువైనది,పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు కానీ దివ్య మిమ్మల్ని కాదు అనుకుంది.ఎంతగా ప్రేమించుకొని ఉంటారు,ఆ ప్రేమ ఇప్పుడు కళ్ళ ఎదురుగా నిలబడి నాకు కష్టం వచ్చింది తీర్చు అంటే ఆ మనసు ఎంత బాధపడుతుంది.నీ భార్యగా నిన్ను అపార్థం చేసుకుంటే మన ఐదు సంవత్సరాల ఈ బంధానికి అర్థం లేదు సరి కదా నాకే కదా బాధ.నీ అర్థాంగి గా నేను చేయవల్సిన కర్తవ్యమ్ నాకు అదే సరియినది అనిపించింది " అంటూ అమర్ ప్రేమను దివ్య ముందు గొప్పగా చూపించింది శృతి.శృతి మాటలు విన్న దివ్య శృతిని కౌగలించుకొని నన్ను క్షమించు అంటూ...శేఖర్ నీ తీసుకొని సంతోషంగా దివ్య వెళ్లి పోయింది.

అమర్ చాలా సంతోషం తో శృతిని,హనీ నీ కౌగలించుకొని చల్లని ప్రేమను ఆస్వాదిస్తూ...టీ తాగుతున్నాడు.