పౌర్ణమి🌕
ఇదిగో అమ్మాయి ....ఏంటో ఇలా పిలిచిన ప్రతిసారి నీ మీద నాకున్న అధికారం అనుకోకు ఎందుకంటే ఇది నీ మీద నాకున్న చనువు కేవలం నీ మీద మాత్రమే ఉండే చనువు, ఇంకా చాలా చెప్పాలి అమ్మాయి నీతోటి ముందుగా నువ్వు నాకో విషయం చెప్పు నన్ను నీతో పట్టుకుపోయి రెండు సంవత్సరాలు అయిపోయింది అంట ఇక ఈరోజు చూస్తెనే నాకు అర్థమైంది... అయినా ఈ రెండు సంవత్సరాలలో ఒక్కసారైనా కనిపించలేదా అరే పాపం వాడు ఒకడున్నాడు వాని నాతోపాటు తీసుకుపోయి. మళ్ళీ వాడికి ఇచ్చేద్దాం అని మళ్ళీ అడుగుతున్నా నీకు ఏ అధికారం ఉందోయ్ నన్ను పట్టుకు పోవడానికి, సరేలే నన్ను నీ దగ్గరే ఉంచుకో నాకు మరి ఇవ్వవు నాకు అర్థం అయింది కూడా, ఇవ్వకూడదు నాకు కూడా ఇష్టం లేదు ఎందుకంటే అలా నీ కనులు వైపు చూస్తూ నీతో మాట్లాడే క్షణం...