...

8 views

దాయలేని ప్రేమలు- 3
ఎదురు గా ఉన్న ప్లేట్ లో ఉన్న ఉప్మా ను మరీ భారంగా తింటూ..,
మెస్ దాటింది....

తన ఆశ నెరవేరనందుకు నిరాశ గా,
తరగతి గదిలోకి వెళ్ళి కూర్చుంది...

శృతి కి ఎంతో మంది ప్రపోజ్ చేస్తే
వాళ్ళందరినీ కాదని తను మన్మధ ను
ఎంచు కొంది...
పేరు కు తగిన అందగాడు...
కాలేజీ లో సగం మంది అమ్మాయిలు
అతన్ని ప్రేమిస్తే..
అతను చదువు ను ప్రేమిస్తాడు ..

అతని అందం కోసం ఎదురు చూడని వారు లేరు..
శృతి కి ఎంతో నచ్చాడతను

కొంత కాలం పాటు ఇద్దరు కలిసి
మాట్లాడే అవకాశం ఉండేది కానీ
ఇపుడు ఎగ్జామ్స్ సమయంలో అది కాస్తా లేకుండా పోయిందని ఆవేదన తనది..
అయితే ఇది ఇలా ఎందుకు జరుగుతుందో తనకు తెలియదని ఆమె భావన..
నాలుగు రోజుల తర్వాత...
(ఇంకా ఉంది)...

© గోవింద్ @...