అసూయ
ఒక ఊరిలో కృష్ణ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు.అతను మంచి వ్యక్తిత్వం కలవాడు.అతను నిరుపేద వాడు అవ్వడం చేత చదువుకోలేదు.అతనికి ఒక ఆవు ఉంది.అతను ఆ ఆవుపాలను ఊరిలో అందరికీ పోస్తూ వారు ఎంత ధనాన్ని ఇస్తే అంత తీసుకుంటూ దేన్నీ ఆశించకుండా తృప్తిగా జీవించేవాడు.అతని ప్రక్కింటిలో సకల వేదాలను అధ్యయనం చేసిన ఇంకో బ్రాహ్మణుడు ఉండేవాడు.ఇతను అందరికీ సలహాలు,సూచనలు ఇస్తూ తెలివైన వాడు అని మంచి పేరును సంపాదించు కున్నాడు.ఒక రోజు కృష్ణ నిస్వార్థంగా ఉండడం చూసి ఊరిలో వాళ్ళు...